Electric two-wheelers: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు మరింత పెరగే అవకాశం ఉంది. జూన్ 1, 2023 వరకు FAME II ద్వారా ప్రభుత్వ ఇస్తున్న రాయితీల్లో కోత విధించనుంది. 2019లో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు FAME లేదా ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ హైబ్రిడ్స్ పథకాన్ని తీసుకువచ్చింది. దీంట్లో భాగంగా వాహనం మొత్తం విలువలో 40 శాతం వరకు కేంద్రం ప్రోత్సహాకాలను ఇస్తోంది. ఇకపై ఆ పరిమితిని వాహానాల ఎక్స్ ఫ్యాక్టరీ ధరలో 15 శాతానికి తగ్గించనున్నారు.
Read Also: SI Suspend: మోసం చేశాడంటూ ఎస్సైపై యువతి ఫిర్యాదు.. ఆ అధికారిపై సస్పెన్షన్ వేటు
FAME-2 కింద వాహన తయారీదారులకు కిలోవాట్ అవర్(కేడబ్ల్యూహెచ్)కు రూ.15,000 వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. దీన్ని రూ.10,000లకు తగ్గించనున్నారు. సవరించిన సబ్సిడీ 2023 జూన్ 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునే అన్ని విద్యుత్ ద్విచక్రవాహనాలకు వర్తిస్తుందని భారీ పరిశ్రమల శాఖ నోటిఫికేషన్ లో వెల్లడించింది.
ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీ కెపాసిటీ, సబ్సీడీలో కోత తర్వాత ధరల్లో వస్తున్న మార్పులను పరిశీలిస్తే.. టీవీఎస్ ఐక్యూబ్ బ్యాటరీ కెపాసిటీ 2.25 kWh ఉంటే ఇంతకుముందు దీనికి రూ.22,500 సబ్సిడీ ఉండేది. అయితే ప్రస్తుతం జూన్ 1 తర్వాత నుంచి ఇది రూ.14,870 ఉండే అవకాశం ఉంది. ఇదే విధంగా ఆథర్ 450ఎక్స్ బ్యాటరీ కెపాసిటీ 2.9 kWh, FAME-2 ప్రకారం రూ. 29,000 ఉంటే కొత్త సబ్సిడీ ప్రకారం రూ. 21,653 ఉంటుంది. ఓలా ఎస్1 ప్రో బ్యాటరీ కెపాసిటీ 3.97 kWh, పాత సబ్సిడీ రూ. 39,700 ఉంటే, కొత్తగా రూ.18,749 ఉండే అవకాశం ఉంది.