Venu Goapl Reddy
Author- NTV Telugu-
Uttar Pradesh: 5 ఏళ్ల క్రితం వ్యక్తి మృతి, కట్ చేస్తే.. రెండో భార్య, నలుగురు పిల్లలతో దొరికాడు..
Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో విచిత్రమైన ఘటన జరిగింది. ఐదేళ్ల క్రితం చనిపోయాడని రిపోర్ట్ చేయబడిని వ్యక్తి రెండో భార్య, నలుగురు పిల్లలతో ఢిల్లీలో పట్టుబడ్డారు. 2018లో కుమార్, అతని సోదరులపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి వేద్ ప్రకాష్ క్రిమినల్ కేసు నమోదు చేశాడు. ఈ కేసు తర్వాత నుంచి కుమార్ అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బాగ్‌పత్‌లో చోటు చేసుకుంది. -
Instagram Reels: ఇన్స్టాగ్రామ్ రీల్స్ వద్దన్నందుకు భర్త గొంతు కోసి చంపిన భార్య..
Instagram Reels: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి పలువురు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ హంగామా చేస్తున్నారు. కాలక్షేపంగా చేయాల్సిన ఇలాంటి పనులు వ్యసనంగా మారుతున్నాయి. కొందరు 24 గంటలు రీల్స్ మత్తులోనే మునిగిపోతున్నారు. తన రీల్స్‌కి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయనేది చూస్తున్నారు. చివరకు ఎలా తయారైందంటే ఇన్‌స్టా రీల్స్ చివరు కుటుంబాల్లో గొడవలకు, హత్యలకు కారణమవుతున్నాయి. -
Haryana: ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై ప్రధాని, సీఎంకి 500 మంది విద్యార్థినుల లేఖ
Haryana:హర్యానాలోని సిర్సాకు చెందిన 500 మంది ఉమెన్స్ కాలేజ్ విద్యార్థినులు, చౌదరి దేవీలాల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీతో పాటు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్‌కి లేఖ రాశారు. ప్రొఫెసర్ని విధుల నుంచి తొలగించడమే కాకుండా.. అతడిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు. -
Lakshadweep: మాల్దీవ్స్ వివాదం నడుమ ఇంటర్నెట్లో దుమ్మురేపుతున్న “లక్షద్వీప్”.. 20 ఏళ్లలో ఇదే అధికం..
Lakshadweep: ఇండియా-మాల్దీవ్స్ వివాదం నడుమ ‘‘లక్షద్వీప్’’ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. భారతదేశంలో మొన్నటి వరకు పెద్దగా భారతీయులే పట్టించుకోని ఈ ద్వీపాల గురించి ప్రస్తుతం ప్రపంచమే సెర్చ్ చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ఒక్క పర్యటన లక్షద్వీప్ ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. ప్రపంచ టూరిస్టులు ఈ ఐలాండ్స్ గురించి ఇంటర్నెట్లో తెగవెతికేస్తున్నారు. సరైన విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరో మాల్దీవ్స్ అవుతాయంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. -
12th Fail: “12th ఫెయిల్”పై ఐఏఎస్ అవనీష్ శరణ్ ప్రశంసలు.. అద్భుతం అంటూ కితాబు..
12th Fail: ‘‘12th ఫెయిల్’’ సినిమా ప్రస్తుతం ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ బయోపిక్‌గా తీసిన ఈ సినిమా యూపీఎస్సీ అభ్యర్థుల కష్టాలను, కన్నీటిని, ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారనే అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. మనోజ్ కుమార్ పాత్రలో నటించిన విక్రాంత్ మాస్సేకి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ సినిమా ఎంతో మంది సివిల్స్ ఆశావహులకు, లక్ష్యాన్ని సాధించాలనే యువతకు ప్రేరణ ఇస్తోంది. -
Bangladesh: ‘‘బంగ్లాదేశ్‌కి భారత్ గొప్ప స్నేహితుడు’’.. విజయం తర్వాత పీఎం హసీనా కీలక వ్యాఖ్యలు..
Bangladesh: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్రధాని షేక్ హసీనా విజయం సాధించారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో నాలుగోసారి హసీనా ప్రధాని పగ్గాలు చేపట్టబోతున్నారు. తిరిగి అధికారంలోకి వచ్చిన ఆమె ఎన్నికల విజయం తర్వాత మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్‌కి భారత్ గొప్ప స్నేహితుడు’’ అని ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడటమే కాకుండా, అనేక సమస్యలు పరిష్కరించుకున్నామని సోమవారం అన్నారు. -
India-Maldives row: ఇండియా-మాల్దీవ్స్ వివాదం మధ్యలో “ఇజ్రాయిల్”.. లక్షద్వీప్ గురించి కీలక ప్రకటన..
India-Maldives row: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్‌ని సందర్శించడం, అక్కడి టూరిజాన్ని ప్రమోట్ చేయడం మాల్దీవుల్లో ప్రకంపలను రేపుతోంది. మోడీ టూర్‌ని ఉద్దేశిస్తూ అక్కడి మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరింది. ఇండియన్స్ తమ మాల్దీవ్స్ టూర్లను క్యాన్సల్ చేసుకుంటున్నారు. ఆ దేశంలోని హోటల్స్ బుకింగ్ రద్దవ్వడమే కాదు, టూర్ కోసం ముందుగా చేసుకున్న ఫ్లైట్ టికెట్స్‌ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇక లక్షద్వీప్‌పై భారత నెటిజన్లతో పాటు విదేశీయులు కూడా సెర్చ్ చేస్తున్నారు. -
Gurugram: హాట్ కేకుల్లా లగ్జరీ హోమ్స్.. 3 రోజుల్లోనే 868 మిలియన్ డాలర్ల విలువైన ఇళ్లు విక్రయం..
Gurugram: ఇండియాలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఢిల్లీ సమీపంలో 865 మిలియన్ డాలర్లతో చేపడుతున్న లగ్జరీ హోమ్స్ నిర్మాణం ప్రారంభం కాకముందే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ ప్రాంతంలో 1,113 విలాసవంతమైన నివాసాలను విక్రయించింది. డీఎల్ఎఫ్ ప్రివానా సౌత్ ప్రాజెక్టులోని ఏడు టవర్లను నిర్మిస్తోంది. ఇందులో ఫోర్-బెడ్రూనం నివాసాలు, పెంట్ హౌజ్ యూనిట్లు అమ్ముడైనట్లు డెవలపర్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపారు. -
Rahul Gandhi: బిల్కిస్ బానో తీర్పు.. అహంకార బీజేపీపై విజయం..
Rahul Gandhi: బిల్కిస్ బానో కేసులో ఈ రోజు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గతంలో గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ద్వారా విడుదల చేసిన 11 నిందితులను ఉత్తర్వులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇది న్యాయం సాధించిన విజయమని, బీజేపీ మహిళా వ్యతిరేకి అని, నేరస్తులను ప్రోత్సహిస్తోందని ఆరోపించాయి. -
Maldives Row: భారత్-మాల్దీవ్స్ వివాదం.. చైనా కీలక వ్యాఖ్యలు..
Maldives Row: భారత్, ద్వీప దేశం మాల్దీవ్స్ మధ్య తీవ్ర దౌత్య ఘర్షణ చెలరేగుతోంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ సందర్శించి, అక్కడి పర్యటకాన్ని ప్రమోట్ చేయడం మాల్దీవ్స్ ప్రభుత్వానికి నచ్చడం లేదు. దీంతో అక్కడి మంత్రులు ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇక భారతీయుల దెబ్బకు ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మరోవైపు మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రుల్ని అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
తాజావార్తలు
-
Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!