Pakistan: పాకిస్తాన్ లో హిమపాతం విరుచుకుపడింది. పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్-బాల్టిస్తాన్ హిమాలయ పర్వాతాల్లో ఈ ఘటన సంభవించింది. శనివారం హిమపాతం కారణంగా 11 మంది మరణించారు. 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పర్వత ప్రాంతంలోని ఆస్టోర్ జిల్లాలోని షంటర్ టాప్ ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. ముగ్గురు మహిళలతో సహా 10 మంది మరణించారు. ఈ ప్రమాదంలో గుజ్జర్ కుటుంబానికి చెందిన 25 మంది పీఓకే నుంచి ఆస్టోర్ కు తమ పశువులతో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. హిమపాతం కింద చిక్కుకున్న మృతదేహాలను తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. గాయపడిని వారిలో 13 మందిని ఆస్టోర్ కు తరలించగా.. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని పాక్ మీడియా వెల్లడించింది.
Read Also: New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
స్థానిక ప్రజలతో పాటు పాకిస్తాన్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. ప్రాణనష్టంపై గిల్గిత్-బాల్టిస్థాన్ ముఖ్యమంత్రి ఖలీద్ ఖుర్షీద్ ఖాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయకచర్యలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. హిమపాతం దుర్ఘటనపై పాక్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల ప్రభావాల వల్ల పాకిస్తాన్ లో ఇటువంటి సంఘటనలు పెరిగాయని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి పాకిస్తాన్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను రక్షించడానికి ప్రపంచం మొత్తం తన బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.