Venu Goapl Reddy
Author- NTV Telugu-
Hardik Pandya: మాల్దీవుల వివాదంపై స్పందించిన హర్దిక్ పాండ్యా.. ‘‘ తర్వాతి హాలిడే లక్షదీవుల్లోనే’’
Hardik Pandya: ప్రస్తుతం భారత్-మాల్దీవుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మనదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులను సందర్శించారు. అక్కడ ఉన్న సుందరమైన బీచుల్లో ఆయన పర్యటించిన ఫోటోలను ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేశారు. లక్షదీవుల్లో పర్యాటకాన్ని ప్రమోట్ చేయడమే కాకుండా అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు అక్కడికి వెళ్లారు. -
Lok Sabha elections: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మోడీ శ్రీకారం.. జనవరి 13 నుంచి ప్రారంభం..
Lok Sabha elections: లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. దీంతో బీజేపీ ఎన్నికల మోడ్‌లోకి వెళ్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ప్రధాని నరేంద్రమోడీ శ్రీకారం చుట్టబోతున్నారు. జనవరి 13 నుంచి బీహార్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బీహార్ లోని బెట్టియా నగరంలోని రామన్ మైదాన్‌లో ఆయన బహిరంగ సభకు హాజరుకాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలోనే ప్రధాని బీహార్ లోని రోడ్లు, వంతెనలతో సహా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. -
Ram Mandir: ముస్లిం కరసేవకుడికి రామాలయ ఆహ్వానం.. ఎన్నో ఏళ్ల తపస్సు అని హబీబ్ భావోద్వేగం..
Ram Mandir: అయోధ్యలో ఈ నెల 22న రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశంలోని పలువరు ప్రముఖులకు ఆలయ ట్రస్ట్ ఆహ్వానాలు అందించింది. అయితే ఉత్తర్‌ప్రదేశ్ మీర్జాపూర్లో సాధారణ జీవితం గుడుపుతున్న మహ్మద్ హబీబ్ అనే వ్యక్తికి రామాలయ ఆహ్వానం అందడంతో ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. హబీబ్‌కి రాముడి అక్షింతలు, లేఖ అందాయి. దీంతో అతను భావోద్వేగానికి గురయ్యాడు. -
India-Maldives: ప్రధాని లక్షద్వీప్ టూర్‌తో మాల్దీవుల్లో ఎందుకు కలవరం.? అదును చూసి దెబ్బకొట్టిన మోడీ..
India-Maldives: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవులు వణికిపోతున్నాయి. ఇటీవల ఎన్నికల్లో అక్కడ అధ్యక్షుడిగా మహ్మద్ మయిజ్జూ గెలిచిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం భారత వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తోంది. ఎన్నికల వాగ్దానాల్లో ఎక్కువగా భారత వ్యతిరేకతను ప్రదర్శించి మయిజ్జూ గెలిచారు. చైనాకు అత్యంత అనుకూలుడని ఇతనికి పేరుంది. ఇప్పటికే ఆ దేశంలో ఉన్న 77 మంది భారత సైనికులను మీ దేశం వెళ్లాల్సిందిగా ఆదేశించాడు. -
Benjamin Netanyahu: హమాస్ నాశమయ్యే వరకు యుద్ధం ఆగదు.. స్పష్టం చేసిన ఇజ్రాయిల్ ప్రధాని..
Benjamin Netanyahu: ఇజ్రాయిల్ తన అన్ని లక్ష్యాలను సాధించే వరకు యుద్ధాన్ని ఆపబోదని మరోసారి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ నాశనం అయ్యేంత వరకు గాజా యుద్ధం ఆగేది లేదని ప్రకటించారు. మూడు నెలల క్రితం హమాస్ మాపై దారుణమైన దాడికి పాల్పడ్డారు, హమాస్ నిర్మూలించాలని, బందీలను తిరిగి తీసుకురావాలని, గాజా నుంచి ఇజ్రాయిల్‌పై మరోసారి దాడులు ఎదురుకావద్దని తాను ఇజ్రాయిల్ ఆర్మీని ఆదేశించినట్లు ప్రధాని నెతన్యాహూ చెప్పారు. -
Karnataka: ముస్లిం యువతితో కలిసి ఉన్నందుకు దళిత హిందూ యువకుడిపై దాడి..
Karnataka: కర్ణాటకలో మతపరమైన ఉద్రిక్తత ఏర్పడింది. బెలగావిలో ఒక దళిత హిందూ యువకుడు, ముస్లిం యువతితో కలిసి కూర్చోవడాన్ని తప్పుపడుతూ ముస్లిం పురుషుల బృందం వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడిలో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
Maldives: మోడీపై మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం.. వాటితో మాకు సంబంధం లేదన్న అక్కడి ప్రభుత్వం..
Maldives: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్‌ని సందర్శించడాన్ని మాల్దీవులు తట్టుకోలేకపోతోంది. ప్రధాని లక్ష్యంగా మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన అవమానకర వ్యాఖ్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానిని ‘‘విదూషకుడు, తోలుబొమ్మ’’ అంటూ ఆమె ఎక్స్‌లో కామెంట్ చేసింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో పోస్టును తొలగించింది. అయితే ప్రధానిపై ఆమె చేసిన వ్యాఖ్యల్ని భారత్, మాల్దీవులు ప్రభుత్వం వద్ద లేవనెత్తింది. భారత హైకమిషనర్ ఈ విషయాన్ని మాలేలోని మహ్మద్ మయిజ్జూ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని సంప్రదించారు. -
Maldives Row: మాల్దీవుల వివాదంలో ప్రధాని మోడీకి సెలబ్రెటీల మద్దతు.. లక్షద్వీప్‌లో టూరిజం అభివృద్ధికి పిలుపు..
Maldives Row: ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల లక్షద్వీప్‌ని సందర్శించి అక్కడ పర్యాటకాన్ని ప్రమోట్ చేయడం మాల్దీవులకు అస్సలు నచ్చడం లేదు. పూర్తిగా పర్యాటకంపై ఆధారపడిన ఆ దేశానికి భారత్ నుంచే ఎక్కువ మంది వెళ్తుంటారు. అయితే ఇటీవల ఏర్పడిన మహ్మద్ మయిజ్జూ ప్రభుత్వం చైనా అనుకూల, భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. తాజాగా ప్రధాని లక్షద్వీప్ వెళ్లడం ఆ దేశానికి మింగుడు పడటం లేదు. -
Bihar: భారతీయ ముస్లింలకు ప్రత్యేక మాతృభూమి కావాలి.. ప్రొఫెసర్ వివాదస్పద పోస్ట్..
Bihar: బీహార్ ప్రొఫెసర్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. జేపీ యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలో పొలిటికల్ సైన్స్ విభాగం హెడ్‌గా ఉన్న ఖుర్షీద్ ఆలం అనే ప్రొఫెసర్ ‘భారత ముస్లింలకు ప్రత్యే మాతృభూమి కావాలి’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఆ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Maldives: ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవుల్లో ప్రకంపనలు.. భారత్‌పై అక్కసు..
Maldives: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటన మాల్దీవుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్‌పై, ప్రధాని మోడీపై అక్కడి నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇటీవల మాల్దీవుల్లో చైనా అనుకూల మహ్మద్ మొయిజ్జూ అధ్యక్షుడిగా గెలిచాడు. ఇతని నేతృత్వంలోని ప్రభుత్వం భారత్ వ్యతిరేక చర్యల్ని అవలంభిస్తోంది. ఇదే కాకుండా అక్కడ ఉన్న 77 మంది భారత సైనికులను వెళ్లాలని ఆదేశిస్తోంది. మరోవైపు మొయిజ్జూ చైనాలో పర్యటించే పనిలో ఉన్నారు.
తాజావార్తలు
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
ట్రెండింగ్
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!