Love Jihad: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆ రాష్ట్ర పోలీస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం రాష్ట్రంలోని సీనియర్ పోలీస్ అధికారులతో సమావేశమైన ఆయన ‘‘లవ్ జిహాద్’’పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఉత్తరాఖండ్ లో విభిన్న మతాలకు చెందిన వారు శాంతియుతంగా సహజీవనం చేస్తున్నారని.. అయితే లవ్ జిహాద్ వంటి వాటిని సహించేది లేదని హెచ్చరించారు. కుట్రలో భాగం ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ప్రజలు ఇప్పుడు ముందుకు వస్తున్నారని సీఎం…
Manipur Violence: గత నెల రోజులుగా జాతుల మధ్య ఘర్షణల కారణంగా మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. తాజాగా శుక్రవారం అనుమానిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు.
Digital India Bill: ఇంటర్నెట్ ను నియంత్రించేందుకు, దేశంలో సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘డిజిటల్ ఇండియా బిల్లు’ను తీసుకురాబోతోంది.
Mumbai Mira Road Incident: ముంబై మీరా రోడ్ హత్య కేసులో సంచనల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లివ్ ఇన్ పార్ట్నర్ అయిన 32 ఏళ్ల సరస్వతి వైద్య అనే మహిళను హత్య చేసి ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి శరీర భాగాలను ఉడికించి పలు ప్రాంతాల్లో పారేశాడు. ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్యను తలపించేలా ఈ హత్య జరిగింది. నిందితుడు మనోజ్ సానే(56)తో గత కొంతకాలంగా సహజీవనంలో ఉన్నారు. ఈ హత్య వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Google: కోవిడ్ మహమ్మారి పుణ్యామా అని ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు దొరికింది. అయితే కోవిడ్ ప్రస్తుతం పోయినా కూడా కొందరు మాత్రం ఆఫీసులకు వెళ్లం, ఇంటి దగ్గర నుంచే పని చేస్తామని చెబుతున్నారు. అలాంటి వారికి పలు సాఫ్ట్వేర్ కంపెనీలు వార్నింగ్ ఇస్తున్నాయి.
Jharkhand: జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న బొగ్గు గని కుప్పకూలింది. జార్ఖండ్‌లోని భౌరా కొల్లేరీ ప్రాంతంలో శుక్రవారం అక్రమంగా నిర్వహిస్తున్న గని పైకప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక చిన్నారితో సహా ముగ్గురు మరణించారు.
Asaduddin Owaisi: ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ లపై ఓ వర్గం అనుకూల సోషల్ మీడియా పోస్టులు మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయ్యాయి. దీంతో హిందూ సంఘాలు పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది.
Russian tourist eaten by shark: ఈజిప్ట్ లో ఘోరమైన సంఘటన జరిగింది. సరదాగా సముద్రంలో సేదతీరుదాం అనుకున్న వ్యక్తి సొరచేప దాడిలో ప్రాణాలు వదిలాడు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి చివరి క్షణం వరకు బాధితుడు ప్రయత్నించినా షార్క్ నుంచి తప్పించుకోలేకపోయాడు.