Sini Shetty: 2023లో మిస్ వరల్డ్ పోటీలకు ఇండియాకు ప్రాతినిధ్యం ఇవ్వనుంది. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అందాల పోటీ 27 ఏళ్ల తరువాత భారత్ లో మళ్లీ నిర్వహించబోతోంది.
The Lancet Report:దేశంలో గుట్టుచప్పుడు కాకుండా బీపీ, షుగర్ తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ది లాన్సెట్ డయాబెటిక్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశ జనాభాలో 11.4 శాతం మంది షుగర్ తో బాధపడుతున్నారు.
S Jaishankar: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శలు గుప్పించారు. విదేశాల్లో భారత్ ను విమర్శించడం రాహుల్ గాంధీకి అలవాటే అంటూ.. జాతీయ రాజకీయాలను విదేశాల్లో చర్చించడం శ్రేయస్కరం కాదని జైశంకర్ అన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యుల చేశారు. దీనిపై మీడియా జైశంకర్ ని ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు.
Gujarat High Court: బాలిక అబార్షన్ పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 17 ఏళ్ల బాలిక తన 7 నెలల గర్భాన్ని తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది కోర్టు. గతంలో 14-15 ఏళ్ల వయసులోనే ఆడపిల్లలు పెళ్లి చేసుకుని, 17 ఏళ్లకు బిడ్డకు జన్మనిచ్చేవారని గుజరాత్ హైకోర్టు గురువారం మౌఖికంగా వ్యాఖ్యానించింది.
Gaming Addiction:మొబైల్ గేమింగ్ ఎంత ప్రమాదకరం ఇటీవల కొన్ని సంఘటనలు తెలియజేస్తున్నాయి. ఈ గేమింగ్స్ కు పిల్లలు బానిస అవుతున్నారు. తల్లిదండ్రలుకు తెలియకుండా వారి ఖాతాల నుంచి డబ్బులు గేమ్స్ కోసం తగలేస్తున్నారు. ఇటు ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యంగా తీవ్రం నష్టపోతున్నారు.
Technical Recession: ప్రపంచం అంతా ఆర్థికమాంద్యంతో భయపడుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, కరోనా మహమ్మారి, పెరుగుతున్న వడ్డీరేట్లు, ద్రవ్యోల్భణ పరిస్థితులు ప్రపంచాన్ని మాంద్యం దిశగా వెళ్లేలా చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు నెగిటివ్ వృద్ధిరేటును నమోదు చేస్తున్నాయి.
S Jaishankar: కొత్త పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేసిన ‘అఖండ భారత్’ చిత్రంపై పాకిస్తాన్ ప్రేలాపనను తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్. దీనిపై పాకిస్తాన్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. అవిభాజ్య భారతదేశం చిత్రాన్ని, అశోక సామ్రాజ్యాన్ని, బాధ్యతయుతమైన, ప్రజా ఆధారిత పాలనను ఇది చూపుతుందని, అర్థం చేసుకునే శక్తి పాకిస్తాన్ కు లేదని అందుకే దాన్ని అర్థం చేసుకోలేకపోతోందని విమర్శించారు.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబు దాడితో దద్దరిల్లింది. ఈ వారం ప్రారంభంలో హత్యకు గురైన ఆఫ్ఘన్ మంత్రి అంత్యక్రియల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. బదక్షన్ ప్రావిన్స్ రాజధాని ఫైజాబాద్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. ఈ బాంబుదాడిలో 11 మంది మరణించగా.. 30 మంది గాయపడినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. ఆఫ్ఘన్ ప్రభుత్వం ఈ దాడిని ఖండించింది.
Oxygen Kits To Be Mandatory In All Vehicles: సిక్కిం రాష్ట్రం అన్ని వాహనాల్లో ఆక్సిజన్ కిట్లను తప్పనిసరి చేసింది. హిమాలయ పర్వత ప్రాంతాల్లో, ఎత్తైన కొండల మధ్య ఉన్న సిక్కిం రాష్ట్రంలో ఇటీవల ఎత్తైన ప్రాంతాల్లో ప్రజలు శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Smriti Irani: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ‘ మొహబ్బత్ కీ దుకాన్’పై ప్రేమ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై ప్రేమ ఉంటే కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని ఎందుకు బహిష్కరించారని ఆమె ప్రశ్నించారు. సిక్కుల ఊచకోత కోసే ప్రేమ, బొగ్గు దోచుకునే ప్రేమ, దేశాన్ని తిట్టినవారితో కరచాలనం, కౌగిలించుకునే ప్రేమ, కేరళ స్టోరీ వస్తే మాట్లాడని ప్రేమ, సెంగోల్ ని అవమానించే ప్రేమ అసలు ప్రేమ ఎలా అవుతుందని..? అని ప్రశ్నించారు.