Russian tourist eaten by shark: ఈజిప్ట్ లో ఘోరమైన సంఘటన జరిగింది. సరదాగా సముద్రంలో సేదతీరుదాం అనుకున్న వ్యక్తి సొరచేప దాడిలో ప్రాణాలు వదిలాడు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి చివరి క్షణం వరకు బాధితుడు ప్రయత్నించినా షార్క్ నుంచి తప్పించుకోలేకపోయాడు. ప్రాణాల కాపాడాలని తండ్రిని కాపాడాలని కోరినా అతని ఆవేదన అరణ్య రోదనగానే మిగిలింది. ఈ ఘటన ఈజిప్ట్ లోని ప్రసిద్ధ రిసార్ట్ అయిన హుర్ఘదాలో జరిగింది. రష్యాకు చెందిన 23 ఏళ్ల టూరిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు.
Read Also: Sini Shetty: మిస్ వరల్డ్ 2023లో భారత తరుపున “సినీ శెట్టి” ప్రాతినిధ్యం.. అసలెవరీ సినీ షెట్టి..
తీరం వద్ద నిలబడి ప్రజలు చూస్తున్నారు తప్పితే, ఏం చేయలేని పరిస్థితి. క్షణాల కాలంలో టైగర్ షార్క్ ఆ యువకుడిపై పలుమార్లు దాడి చేసింది. బాధిత యువకుడిని వ్లాదిమిర్ పోపోవ్ గా గుర్తించారు. ఒడ్డున ఉన్న తన తండ్రి కోసం ‘‘పాపా..పాపా’’ అంటూ తనను కాపాడాలని కోరాడు. అయితే ఒడ్డున ఉన్న తండ్రి ఈ షాకింగ్ ఘటనకు నిశ్చేష్టుడై చూశాడు తప్పితే, ఏం కొడుకును కాపాడుకునేందుకు ఏం చేయలేకపోయాడు. అక్కడ ఉన్న వారంతా షార్క్ దాడిని కెమెరాల్లో బంధించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఈ ఘటన నుంచి పోపోవ్ ఫ్రెండ్ తృటితో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంది.
ఈ ఘటనతో సముద్రం రక్తంతో ఎర్రగా మారడం కనిపిస్తుంది. ముందుగా బాధితుడు షార్క్ దాడికి గురయ్యాడు. ఆ తరువాత దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా మరోసారి దాడి చేసి పోపోవ్ ను నోట కరుచుకుని తినేసింది. ఈ ఘటనతో అప్రమత్తం అయిన హోటల్ సిబ్బంది ఎమర్జెన్సీ అలారాన్ని మోగించి, వెంటనే సముద్రంలో నుంచి బయటకు రావాలని కోరారు. తమ కళ్లముందే యువకుడిని షార్క్ చంపి తినేసిందని, సమీపంలో ఈత కొడుతున్న మరికొందరు తెలిపారు. ఈ ఘటనలో అంతా భయభ్రాంతులకు గురయ్యారు. షార్క్ ను పట్టుకున్నట్లు ఈజిప్ట్ పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. టైగర్ షార్క్ ని పరిశోధించడానికి ప్రయోగశాలకు తీసుకెళ్లామని తెలిపింది.
https://twitter.com/nabilajamal_/status/1667039099851780097