Digital India Bill: 11 రకాల కంటెంట్లను నిషేధించనున్న డిజిటల్ ఇండియా బిల్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digital India Bill: ఇంటర్నెట్ ను నియంత్రించేందుకు, దేశంలో సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘డిజిటల్ ఇండియా బిల్లు’ను తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను ఎలక్ట్రానిక్స్, ఐటీ టెక్నాలజీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. డిజిటల్ ఇండియా బిల్లుపై ఈ నెలలో సంప్రదింపులు ప్రారంభమవుతాయని, కొత్తగా తీసుకురాబోతున్న డిజిటల్ పర్సనల్ డేటా డిజిటల్ ఇండియా బిల్లు త్వరలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నట్లు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Read Also: Mumbai Mira Road Incident: ముంబై “లివ్ ఇన్ పార్ట్‌నర్” హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
కొత్తగా తీసుకురాబోతున్న డిజిటల్ ఇండియా బిల్లు 11 రకాల కంటెంట్లను నిషేధిస్దుందని రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. పోర్న్ కంటెంట్, పిల్లలకు హాని కలిగించే కంటెంట్, మరపరమైన ఉద్రిక్తతలు, పేటెంట్ ఉల్లంఘన, తప్పుదారి పట్టించే కంటెంట్, భారతదేశ ఐక్యత-సమగ్రతకకు విఘాతం కలిగించే కంటెంట్, కంప్యూటర్ మాల్వేర్, చట్టవిరుద్దమైన, నిషేధిత ఆన్లైన్ గేమ్స్ వంటి కంటెంట్లను నిషేధిస్తుంది. ఇలాంటి కంటెంట్లను వ్యాప్తి చేసే ప్లాట్‌ఫారమ్‌ల చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది.
2014లో ప్రపంచంలోనే డిజిటల్ అనుసంధానించబడిన దేశం మనది అని చంద్రశేఖర్ అన్నారు. ప్రస్తుతం మనదేశంలో 85 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. 2025నాటికి ఈ సంఖ్య 120 కోట్లకు చేరుకుంటుందని అంచానా వేశారు. ప్రస్తుత సవాళ్లకు యూపీఏ ప్రభుత్వమే కారణమని ఆయన దుయ్యబట్టారు. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఐటీ చట్ట సవరణ నుంచి కొన్ని టెక్, సోషల్ మీడియా కంపెనీలు మినహాయింపును పొందాయని అన్నారు. ప్రస్తుతం కేంద్ర తీసుకురాబోతున్న డిజిటల్ ఇండియా బిల్లు ఇంటర్నెట్ సురక్షితంగా చేయడంతో పాటు యూజర్లను రక్షించడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది. భారతదేశాన్ని సురక్షిత, విశ్వసనీయ దేశంగా మార్చాలని తాము భావిస్తున్నట్లు చంద్రశేఖర్ అన్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!