Mumbai Mira Road Incident: ముంబై మీరా రోడ్ హత్య కేసులో సంచనల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లివ్ ఇన్ పార్ట్‌నర్ అయిన 32 ఏళ్ల సరస్వతి వైద్య అనే మహిళను హత్య చేసి ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి శరీర భాగాలను ఉడికించి పలు ప్రాంతాల్లో పారేశాడు. ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్యను తలపించేలా ఈ హత్య జరిగింది. నిందితుడు మనోజ్ సానే(56)తో గత కొంతకాలంగా సహజీవనంలో ఉన్నారు. ఈ హత్య వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే ఈ కేసులో పలు ట్విస్టులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు నిందితుడు మనోజ్ సానే, మృతురాలు సరస్వతి వైద్యం సహజీవనం చేస్తున్నారని అంతా అనుకున్నప్పటికీ..వీరికి వివాహం జరిగిందనే కొత్త విషయం విచారణలో వెలుగులోకి వచ్చింది. మృతురాలు తన నలుగురు అక్కాచెల్లిళ్లతో టచ్ లోనే ఉంది. వీరిలో ముగ్గురిని శుక్రవారం పోలీసులు విచారించారు. సరస్వతి, మనోజ్ సానే ఒక దేవాలయంలో వివాహం చేసుకున్నారని, ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో ఎవరికి చెప్పలేదని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: Google: మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిందే, లేకపోతే.. ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్..
అహ్మద్‌నగర్‌లో పాఠశాల మానేసిన సరస్వతి ముంబైకి వెళ్లడానికి ముందు కొన్ని సంవత్సరాలు తన అక్కలతో కలిసి నివసించింది. బోరివలిలోని ఓ రేషన్ షాపులో నిందితుడు మనోజ్ సానేని సరస్వతి కలుసుకుంది. మనోజ్ సానే ఆ షాపులోనే పనిచేసేవాడు. ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరగడం, ఆ తరువాత సరస్వతికి, సానే జాబ్ చూసిపెట్టారు. చివరకు ఇద్దరు కూడా ఒకే ఇంట్లో కలిసి నివసించే వరకు బంధం బలపడింది. సరస్వతి చిన్నతనంలోనే తల్లిని కోల్పోగా.. తండ్రి వదిలివెళ్లిపోయాడు. సరస్వతితో పాటు ఆమె సోదరీమణులందరూ అనాథాశ్రయంలో పెరిగారు.
ఇదిలా ఉంటే నిందితుడు సానే.. పోలీస్ విచారణలో సరస్వతి విషం తాగి ఆత్మహత్య చేసుకుందని, దీంతో భయపడిన తాను శరీరాన్ని ముక్కులగా చేసినట్లు పేర్కొన్నాడు. నేరాన్ని కప్పిపుచ్చేందుకే అతడు అబద్దాలు ఆడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నిందితుడు ఎందుకు హత్య చేయడానికి కారణాలు ఇంకా నిర్థారణ కాలేదు. సానే ఎలక్ట్రిక్ రంపంతో సరస్వతి మృతదేహాన్ని ముక్కలుగా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మంగళవారం వీరుంటున్న గది నుంచి దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.