Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘‘ఓట్ చోరీ’’ ఆరోపణలో గురువారం మీడియా ముందుకు వచ్చారు. కొన్ని ఉదాహరణలు వివరిస్తూ, దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోందని అన్నారు. కర్ణాటకలో అలంద్ నియోజకవర్గంలో 6000 ఓట్లను తొలగించినట్లు ఆరోపించారు. కేంద్రం ఎన్నికల సంఘం ఓట్ చోరీకి పాల్పడే వారికి అండగా నిలుస్తుందని ఆరోపణలు చేశారు. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉపయోగించి ఓట్లను తొలగిస్తు్న్నారని అన్నారు.
Gautam Adani: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ , అదానీ పవర్ వంటి అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల్ని మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) తోసిపుచ్చింది. జనవరి 2023లో, అదానీ గ్రూప్ సంస్థల మధ్య డబ్బుల్ని మళ్లించడానికి అడికార్ప్ ఎంటర్ప్రైజెస్, మైల్స్టోన్ ట్రేడ్‌లింక్స్, రెహ్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కంపెనీలను ఉపయోగించుకుందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.
High Court: తన భర్తని కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంచుకోవాలని భార్య ఒత్తిడి చేయడం క్రూరత్వానికి సమానమని, ఒక జంట వివాహాన్ని రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. పదే పదే బహిరంగంగా అవమానించడం, భాగస్వామిని తిట్టడం మానసిక క్రూరత్వమే అని హైకోర్టు పేర్కొంది.
Anil Chauhan: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెపోటిజం(బంధుప్రీతి) లేని ఏకైక ప్రదేశం సైన్యం మాత్రమే అని చెప్పారు. దేశానికి సేవ చేయడానికి, వివిధ ప్రాంతాలను అన్వేషించడానికి సాయుధ దళాల్లో చేరాలని పిల్లలను కోరారు. రాంచీలోని పాఠశాల పిల్లలతో మాట్లాడిన ఆయన, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల్ని కాపాడేందుకు సాయుధ దళాలు ఈ ఏడాది చాలా ప్రయత్నాలు చేశాయని చెప్పారు. Read Also: Coffee: కాఫీ ప్రియులకు అలర్ట్.. […]
Shaolin Temple: చైనాలో ప్రముఖ బౌద్ధాలయం ‘‘షావోలిన్ టెంపుల్’’ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. షావోలిన్ మఠాధిపతి షి యోంగ్క్సిన్ ఆశ్రమాన్ని వ్యాపార సామ్రాజ్యంగా మార్చారనే ఆరోపణలపై చైనీస్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. వ్యక్తిగత సంపద కోసం ఆలయ నిధులను దుర్వినియోగం చేసినట్లు అనుమానిస్తూ, చైనా కఠిన చర్యలు ప్రారంభించింది. మత సంస్థల్ని నియంత్రించడానికి, దేశంలో పెరుగుతున్న ‘‘దేవాలయ ఆర్థిక వ్యవస్థ’’ను పారదర్శకంగా ఉంచడానికి అక్కడి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు చెబుతోంది.
Tamil Nadu: పరువు హత్యలకు తమిళనాడు కేంద్రంగా మారుతోంది. ఈ రాష్ట్రంలో ఇటీవల కాలంలో చాలా పరువు హత్యలు చోటు చేసుకున్నాయి. తమిళనాడు మైలదుత్తురై జిల్లాలోని ఆదియమంగళంలో జరిగిన దళిత యువకుడు వైరముత్తు హత్య కేసులో నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Turkey: శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సామెతను భారతదేశం పాటిస్తోంది. అన్ని వేళల్లో పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్న టర్కీ, అజర్ బైజాన్ దేశాలకు ఇదే సూత్రాన్ని వర్తింపచేస్తోంది. ఇప్పటికే, అజర్ బైజాన్‌కు వ్యతిరేకంగా ఆర్మేనియాకు పెద్ద ఎత్తున భారత్ ఆయుధాలను అందిస్తోంది. మరోవైపు, టర్కీకి కూడా చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. టర్కీకి అతిపెద్ద శత్రువుగా ఉన్న సైప్రస్ దేశంలో భారత్ తన రక్షణ సంబంధాలను పెంచుకుంటోంది.
Saudi-Pak defence deal: సౌదీ అరేబియా పాకిస్తాన్‌తో "వ్యూహాత్మక పరస్పర రక్షణ" ఒప్పందంపై కాంగ్రెస్ గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది భారత జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇది భారత ప్రధాని నరేంద్రమోడీ దౌత్యానికి ఎదురుదెబ్బగా దీనిని అభివర్ణించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ అకస్మాత్తుగా ఆగిపోయిన నెల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు వైట్ హౌజ్‌లో విందు ఇచ్చారని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏప్రిల్‌లో పహల్గామ్…
Arab-Islamic Summit: ఇటీవల హమాస్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ఖతార్ రాజధాని దోహాపై విరుచుకుపడింది. హమాస్ నేతలు సమావేశమైనట్లు భావిస్తున్న భవనంపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ పరిణామాలను అసలు ఖతార్ ఊహించలేదు. ఈ దాడుల్ని పిరికిదాడులుగా అభివర్ణించింది. ఈ దాడులు, గాజాలో ఇజ్రాయిల్ దాడుల తీవ్రత పెంచిన తర్వాత అరబ్-ఇస్లామిక్ నేతల సమాశానికి దోహా వేదికైంది. ప్రపంచం నలుమూల నుంచి వచ్చిన ఇస్లామిక్ దేశాల అధినేతలు ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా పెద్ద పెద్ద కామెంట్స్ […]
Wolf Attacks: గతేడాది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని వరసగా తోడేళ్ల దాడులు వణికించాయి. ముఖ్యంగా బ్రహ్రైచ్ జిల్లాలో పలు గ్రామాల్లో మనుషులే టార్గెట్‌గా దాడులు చేశాయి. వీటిని పట్టుకునేందుకు యోగి సర్కార్ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. వందలాది అధికారుల్ని, బలగాలను మోహరించారు.