Krithi Shetty: కృతి శెట్టి.. ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?
- గోల్డెన్ లెగ్‌గా మారిన కృతి శెట్టి
- వరుస పరాజయాలతో పడిపోయిన బేబమ్మ గ్రాఫ్
- సంక్రాంతి రేసులోకి కార్తీ వా వాతియర్
- కృతి శెట్టి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో హ్యాట్రిక్ హిట్స్‌తో గోల్డెన్ లెగ్‌గా మారిన కృతి శెట్టి.. ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ చవిచూశారు. వరుస పరాజయాలతో బేబమ్మ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. దీంతో కాస్త గ్యాప్ ఇచ్చి.. కోలీవుడ్ ప్రాజెక్ట్స్‌కు కమిటయ్యారు. కానీ ‘వా వాతియార్’, ‘లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ’, ‘జీని’ సినిమాలు ఏ టైంలో సైన్ చేసిందో కానీ.. రోజుల తరబడి షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. హమ్మయ్య ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టాయి అనుకున్న వా వాతియార్, లిక్ పలు మార్లు వాయిదా పడి డిసెంబర్ బరిలోకి వస్తాయంటే వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు కార్తీ వా వాతియర్ అన్ని సమస్యలు సాల్వ్ చేసుకుని సంక్రాంతి రేసులోకి వచ్చేసింది. అయితే కృతి ఏ ఇండస్ట్రీలో అడుగుపెడితే.. డెబ్యూ మూవీతో కచ్చితంగా వంద కోట్లు కొల్లగొట్టాల్సిందే. ఒక్కసారే కాదు.. మూడు సార్లు ఆ మ్యాజిక్ జరిగింది.
Also Read: Nari Nari Naduma Murari Hit: ఒక్క సినిమా.. ముగ్గురు కంబ్యాక్!
Also Read
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
హృతిక్ రోషన్ సూపర్ 30తో కృతి శెట్టి కెరీర్ స్టార్ చేశారు. ఆ సినిమా ఏకంగా రూ.200 కోట్లను వసూలు చేసింది. వైష్ణవ్ తేజ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చిన ‘ఉప్పెన’తో హీరోయిన్ అయ్యారు బేబమ్మ. ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఈ బొమ్మ.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని కృతిని ఓవర్ నైట్ స్టార్ బ్యూటీని చేసింది. అంతేకాదు ఉప్పెన మూవీ వంద కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక్కడే కాదు మలయాళంలో ఈ మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది. టొవినో థామస్ హీరోగా వచ్చిన ఏఆర్ఎంతో మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2024లో రిలీజైన ఈ మూవీకి కాసుల వర్షం కురిపించారు మలయాళ ఆడియన్స్. ఈ బొమ్మ కూడా వంద కోట్లను కొల్లగొట్టింది. ఇలా త్రీ ఇండస్ట్రీల్లో అడుగుపెట్టిన ప్రతి సినిమా హండ్రెడ్ క్రోర్ వసూలు చేయడం యాదృచ్చికమో, లక్కో తెలియదు కానీ.. ఇప్పుడు తమిళ ఆడియన్స్ ముందుకు వచ్చారు. మరీ వా వాతియార్‌తో హండ్రెడ్ క్రోర్ హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!