Tamil Nadu: పరువు హత్యలకు తమిళనాడు కేంద్రంగా మారుతోంది. ఈ రాష్ట్రంలో ఇటీవల కాలంలో చాలా పరువు హత్యలు చోటు చేసుకున్నాయి. తమిళనాడు మైలదుత్తురై జిల్లాలోని ఆదియమంగళంలో జరిగిన దళిత యువకుడు వైరముత్తు హత్య కేసులో నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 26 ఏళ్ల వైరముత్తుకు, మాలిని అనే యువతితో సంబంధం ఉంది. ఆమె తల్లి విజయ అగ్రకులానికి చెందినది. ఈ జంట దాదాపుగా దశాబ్ధ కాలం నుంచి రిలేషన్ కలిగి ఉన్నారు. కానీ, యువతి తల్లి ఈ సంబంధాన్ని వ్యతిరేకించింది. మాలిని, వైరముత్తును పెళ్లి చేసుకోవాలని భావించింది.
Read Also: Turkey: ఎర్డోగాన్‌కు ఇండియా దెబ్బ.. టర్కీ శత్రువుతో భారత్ రక్షణ ఒప్పందం..
సెప్టెంబర్ 15న రాత్రి, వైరముత్తును ఒక ముఠా హత్య చేసింది. వైరముత్తు తల్లి రాజలక్ష్మీ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గుగన్, అన్బునిధి, భాస్కర్, విజయలపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాలతో పాటు హత్య నేరాలను మోపారు. ఈ హత్యలో దర్యాప్తు కొనసాగుతోందని, మరో ఇద్దరు అనుమానితుల కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఏడాది జూలైలో, తమిళనాడు తిరునల్వేలికి జిల్లాకు చెందిన 27 ఏళ్ల దళిత వ్యక్తిని పట్టపగలు నరికి చంపారు. ఇది కూడా పరువు హత్యే. బాధితులు కవిన్ సెల్వ గణేష్ చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఇతను ఓబీసీ వర్గానికి చెందిన ఒక యువతితో ప్రేమలో ఉన్నాడు. దీనిపై యువతి కుటుంబం అతడిని హత్య చేసింది.