Trump-Iran: అప్పుడు బుల్లెట్ గురి తప్పింది.. ఈసారి తప్పదు.. ట్రంప్‌కు హత్యా బెదిరింపులు
- ఇరాన్‌లో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు
- ఇరాన్ వైపు దూసుకెళ్తోన్న యూఎస్ విమానాలు
- తాజాగా ట్రంప్‌కు ఇరాన్ హత్యా బెదిరింపులు
- అప్పుడు బుల్లెట్ గురి తప్పింది.. ఈసారి తప్పదని వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలకు దిగబోతుందున్న వార్తల నేపథ్యంలో ట్రంప్ హత్యా బెదిరింపులను ఇరాన్ టీవీ ప్రసారం చేసింది. ‘‘అప్పుడు బుల్లెట్ మిస్ అయింది.. ఈసారి గురి తప్పదు’’ అంటూ ఇరాన్ టీవీ బహిరంగంగా ప్రసారం చేసింది. అంటే అమెరికా దాడికి దిగితే.. ప్రతి దాడి ఉంటుందని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది.

Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
- Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
2024లో ఒక ప్రచార ర్యాలీలో జరిగిన హత్యాయత్నం చిత్రాలను తాజాగా ఇరాన్ మీడియాలో ప్రసారం చేస్తోంది. ఒకవేళ ఇరాన్‌కు ఏదైనా జరిగితే ట్రంప్‌కు ప్రత్యక్ష ముప్పు ఉంటుందని ఇరాన్ రాష్ట్ర టెలివిజన్ వార్నింగ్ ఇచ్చింది. ఈసారైతే బుల్లెట్ గురి తప్పదని సూచించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి.
ప్రస్తుతం గగనతలాన్ని ఇరాన్ మూసేసింది. అన్ని ఎయిర్‌పోర్టులను క్లోజ్ చేసేసింది. దీంతో ఆయా దేశాలకు చెందిన విమాన రాకపోకలు నిలిచిపోయాయి. భారతదేశానికి చెందిన ఎయిరిండియా విమాన రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులకు ఈ మేరకు సూచన జారీ చేసింది. విమాన రాకపోకల్లో అంతరాయం ఉంటుందని తెలియజేసింది.
ఇది కూడా చదవండి: Iran-US: ఇరాన్‌లో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. దూసుకెళ్తోన్న యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక
ప్రస్తుతం యూఎస్ఎస్ అబ్రహం లింకన్ పేరు గల అతి పెద్ద నౌక ఇరాన్ వైపు దూసుకెళ్తోంది. ఇది పూర్తి అణు శక్తితో నడిచే అది పెద్ద వాహన నౌక. కాలిఫోర్నియాలోని నాసా నార్త్ ఐలాండ్‌లో దీని ప్రధాన స్థానం. ఇందులో సూపర్ క్యారియర్, 3-6 డిస్ట్రాయర్లు /క్రూయిజర్లు, 1-2 జలాంతర్గాములు, 7,000-8,000 మంది సైనికులు, 65-70 విమానాలు (F-35, F/A 18 ఉన్నాయి.) వందలాది టోమాహాక్ క్షిపణులు ఉంటాయి. ఇది ఇరాన్ వైమానిక స్థావరాలు, నౌకాదళం, చమురు సౌకర్యాలను దెబ్బతీయగలవు. అంతేకాకుండా అణు స్థావరాలను పూర్తిగా దెబ్బతీయగల సామర్థ్యం దీని సొంతం.
ఇది కూడా చదవండి: Silver Rates: సిల్వర్ దూకుడు.. సంక్రాంతికి కూడా తగ్గేదేలే అంటున్న వెండి
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!