Vijay Sethupathi Birthday: పండగ కబురు.. ‘పూరి-సేతుపతి’ ఫస్ట్ లుక్, టైటిల్‌కు ముహూర్తం ఫిక్స్!
- విజయ్ సేతుపతి అభిమానులకు పండగ కబురు
- పూరి-సేతుపతి సినిమా నుంచి కీలక అప్డేట్
- పూరి-సేతుపతి ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మక్కల్‌సెల్వన్’ విజయ్ సేతుపతి అభిమానులకు సంక్రాంతి పండగ కబురు. దర్శకుడు పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం నుంచి కీలక అప్డేట్ వచ్చింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పూరి-సేతుపతి’ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను విజయ్ పుట్టినరోజు సందర్భంగ జనవరి 16 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ అనౌన్స్‌మెంట్ రావడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
మాస్ ఎంటర్‌టైనర్‌లకు పెట్టింది పేరైన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబినేషన్ తొలిసారి రాబోతుండటంతో సినీ వర్గాల్లోనూ ఆసక్తి పెరిగింది. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీఎన్ నారాయణరావు కొండ్రొల్లా నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పణలో పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతోంది. టెక్నికల్‌గా కూడా ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో ఉండనుందని సమాచారం.
Also Read
- Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
- Geetu Mohandas: "నేను రాసిందొకటి.. తీసిందొకటి".. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
- Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
- Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్‌బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
Also Read: Krithi Shetty: కృతి శెట్టి.. ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?
ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు సంయుక్త మీనన్, టబు, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్, విష్ణు రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మల్టీ స్టారర్ కాస్టింగ్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. విశేషం ఏమిటంటే.. ఈ సినిమాను తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న ఈ సినిమా నుంచి రాబోయే ఫస్ట్ లుక్, టైటిల్‌పై అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Let’s celebrate Makkalselvan @VijaySethuOffl’s birthday with the much-awaited announcement ❤️🔥#PuriSethupathi First Look & Title out tomorrow, 16th January at 11 AM 💥💥💥#HappyPongal 🫶🏻
A #PuriJagannadh film 🎬@Charmmeofficial Presents 🎥
Produced by Puri Jagannadh, Charmme… pic.twitter.com/3tyoPj73oF— Puri Connects (@PuriConnects) January 15, 2026
తాజావార్తలు
-
Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
-
Geetu Mohandas: “నేను రాసిందొకటి.. తీసిందొకటి”.. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
-
Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
-
Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్‌బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
-
OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
ట్రెండింగ్
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్‌ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?