Micron: భారతదేశంలో చిప్ ఫ్యాక్టరీ నెలకొల్పనున్నట్లు సెమికండక్టర్స్ తయారీ దిగ్గజం మైక్రాన్ ప్రకటించింది. గుజరాత్ లో 825 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 6,760 కోట్లు) పెట్టుబడితో ఈ ప్యాక్టరీ నెలకొల్పనున్నట్లు నిర్దారించింది. 2023లోనే మైక్రాన్ ఫ్యాక్టరీ నెలకొల్పే పనులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. రెండు దశల్లో ఈ ప్యాక్టరీని నెలకొల్పనునట్లు తెలిపింది. మైక్రాన్ దేశంలో తొలి సెమీకండక్టర్ తయారీ సంస్థగా రికార్డ్ సృష్టించబోతోంది.
Read Also: Opposition Meeting: నేడు పాట్నా వేదికగా విపక్షాల సమావేశం.. బీజేపీని అడ్డుకోవడమే టార్గెట్..
కేంద్ర, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్టుబడులు పెట్టనున్నాయి. మొత్తం పెట్టుబడి 2.75 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 22,159 కోట్లు). ఇందులో 50 శాతం కేంద్ర ప్రభుత్వం, 20 శాతం గుజరాత్ ప్రభుత్వం నిధులను సమకూర్చనున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ుముందు ఈ ప్రాజెక్టుకు భారత్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్‌లో కొత్త సౌకర్యాల నిర్మాణం 2023లో ప్రారంభమవుతుందని మరియు ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ 2024 చివరిలో అమలులోకి వస్తుందని మైక్రాన్ తెలిపింది. ప్రాజెక్ట్ యొక్క రెండవ దశ దశాబ్దం రెండవ సగంలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. రెండు దశలు కలిపి 5,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
ఈ వారం ప్రారంభంలో, భారతదేశంలో కొత్త సెమీకండక్టర్ టెస్టింగ్ మరియు ప్యాకేజింగ్ యూనిట్ కోసం మైక్రాన్ ప్రణాళికను భారత ప్రభుత్వం ఆమోదించినట్లు తెలిసింది. ప్రధాని అమెరికా పర్యటన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం భారత్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మైక్రాన్ కోరినట్లు తెలుస్తోంది.