Titan: యావత్ ప్రపంచాన్ని ‘టైటాన్’ ప్రమాదం కలవరపరిచింది. అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శిథిలాలు చూసేందుకు వెళ్తున్న క్రమంలో టైటాన్ సబ్ మెర్సిబుల్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో టైటాన్ లో ప్రయాణిస్తున్న మొత్తం ఐదుగురు మరణించారు. దాదాపుగా సముద్రమట్టానికి 4 కిలోమీటర్ల దూరంలో టైటానిక్ శిథిలాల సమీపంలో టైటాన్ కుప్పకూలినట్లు, దాని శిథిలాలను గుర్తించినట్లు యూఎస్ నేవీ వెల్లడించింది. కమ్యూనికేషన్ కోల్పోయిన కొద్ది సేపటికే సముద్ర గర్భం నుంచి భారీ శబ్ధాన్ని గుర్తించినట్లు నేవీ అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాదంపై ‘టైటానిక్’ మూవీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ స్పందించారు. టైటాన్ సంబంధాలు కోల్పోయిన వెంటనే అది పేలిపోయినట్లు తనకు తెలిసిందని ఆయన అన్నారు. టైటాన్ సబ్‌మెర్సిబుల్ ఆచూకీ కోల్పోయిన సమయంలోనే పేలుడులో ధ్వంసం అయినట్లు తాను అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. టైటాన్ లో సంబంధాలు తెగిపోయిన వెంటనే పెద్ద శబ్ధం హైడ్రో ఫోన్లలో రికార్డ్ అయిందని, ట్రాన్స్‌పాండర్లు, కమ్యూనికేషన్ కోల్పోయిందని తనకు గంట లోపే సమాచారం తెలిసిందని ఆయన అన్నారు. ఒషన్ గేట్ సంస్థ మిశ్రమ కార్బన్ ఫైబర్, టైటానియం హల్ తో సబ్‌మెర్సిబుల్ నిర్మించడంపై తనకు అనుమానం ఉందని జేమ్స్ కామెరూన్ చెప్పారు. ఇది భయంకరమైన ఆలోచన అని అన్నారు.
Read Also: Titan Tragedy: విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నా.. పాకిస్తాన్ టైకూన్ “టైటాన్”కు బలైయ్యాడు
1912లో టైటానిక్, టైటాన్ ప్రమాదాన్ని కొన్ని పోలికలు ఉన్నాయని.. రెండు సందర్భాల్లో ఈ యాత్రల్ని లీడ్ చేస్తున్న వారు ప్రజల భద్రతకు సంబంధించిన విషయాలను విస్మరించారని అన్నారు. టైటానిక్ ప్రమాదంలో కెప్టెన్ ముందు మంచు కొండ ఉందని పదేపదే హెచ్చరించారు, అయినప్పటికీ చంద్రుడి లేని ఆ రాత్రి ఓడను వేగంగా ముందుకు పోనివ్వడంతో వేలల్లో ప్రయాణికులు చనిపోయారని అన్నారు.
ఆదివారం రెండు గంటల పాటు సముద్రంలో లోతుకు ప్రయాణించి టైటానిక్ శిథిలాలను చేరుకోవాల్సిన టైటాన్ కేవలం 45 నిమిషాలకే ఉపరితంపై ఉన్న నౌకతో సంబంధాలు కోల్పోయింది. ఆ సమయంలో టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో ఓషియన్ గేట్ వ్యవస్థాపకుడు, సీఈఓ టైటాన్ ని నడుపుతున్న స్టాక్ టన్ రష్, బ్రిటిష్ బిలియనీర్ హహీష్ హార్డింగ్(58), పాకిస్తాన్-బ్రిటిష్ వ్యాపారవేత్త సాజాదా దావూద్(48), అతని కుమారుడు సులేమాన్(19), టైటానిక్ నిపునుడు హెన్రీ నార్గోలెట్(77) ఉన్నారు. వీరంతా ప్రస్తుతం మరణించారు.