Kia Seltos facelift: దక్షిణ కొరియా కార్ మేకర్ కియా నుంచి కొత్తగా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రాబోతోంది. జూలై 4న ఈ కారును ఆవిష్కరించబోతున్నారు. మరింత స్టైలిష్ గా మరిన్ని ఫీచర్లలో కొత్త సెల్టోస్ రాబోతోంది. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన అనధికారిక బుకింగ్స్ ప్రారంభయం అయ్యాయి. కొన్ని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లతో వాహనాన్ని రిజర్వ్ చేయడానికి రూ. 25,000 టోకెన్ మొత్తాన్ని తీసుకుంటున్నారు. మిడ్-సైజ్ ఎస్‌యూవీని జూలై 4న ఆవిష్కరించనుండగా, అదే నెలలో మార్కెట్ లో లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది.
ఎక్స్టీరియర్, ఇంటిరీయర్లలో చాలా మార్పులు కొత్త సెల్టోస్ లో ఉండనున్నాయి. హెడ్ లైట్ల, డీఆర్ఎల్స్, టెయిల్ లైట్స్ ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మొత్తం లైట్లు ఎల్ఈడీ యూనిట్లతో ఉండనున్నాయి. కొత్త డిజైన్ తో అల్లాయ్ వీల్స్ ఉండనున్నాయి. గత సెల్టోస్ కార్లలో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఉంటే.. కొత్తగా రాబోతున్న ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లో పనోరమిక్ సన్ రూఫ్ ఉండనుంది. ప్రస్తుతం మిడ్ సైజ్ ఎస్‌యూవీ కార్ల విభాగంలో హ్యుందాయ్ క్రేటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారల్లో పనోరమిక్ సన్ రూఫ్ ఉంది. కొత్తగా ADAS ఫీచర్లను సెల్టోస్ ఫేస్ లిఫ్టులో అందిస్తున్నారు. ప్రస్తుతం MG ఆస్టర్ మాత్రమే ADASని కలిగి ఉంది.
వీటితో పాటు హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ ని అప్డేట్ చేసినట్లు తెలుస్తోంది. మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ లో మొదటిసారిగా డ్యూయర్ జోన్ క్లైమెట్ కంట్రోల్ ఫీచర్లని తీసుకువస్తోంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని కూడా అప్ గ్రేడ్ చేసినట్లు తెలుస్తోంది.
సెల్టోస్ లో ప్రస్తుతం రెండు ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.5-లీటర్ స్మార్ట్‌స్ట్రీమ్ పెట్రోల్, 1.5-లీటర్ CRDi VGT డీజిల్ ఇంజిన్ల ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ 115 పీఎస్ పవర్, 144 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ ఎంటీ లేదా ఐవీటీ ట్రాన్స్మిషన్లు లలో అందుబాటులో ఉంది. డిజిల్ ఇంజిన్ గరిష్టంగా 116 పీఎస్ పవర్, 250 ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. డిజిల్ ఇంజిన్ లో మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ ఐఎంటీ ఉన్నాయి. కియా సెల్టోస్ ధర ప్రస్తుతం రూ. 10.89 లక్షల నుండి రూ. 19.65 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కొత్త కియా సెల్టోస్ 2023 ధర రూ. 11 లక్షల నుండి రూ. 21 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది.