Maharashtra Bus Fire: మహారాష్ట్ర బస్సు అగ్నిప్రమాదం.. 25 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఇదే కావచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Bus Fire: మహారాష్ట్రలో ఘోర బస్సు అగ్నిప్రమాదంలో 25 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రధాని నరేంద్రమోడీ సంఘటనలో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బుల్దానా జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం జరిగింది. మొత్తం 33 మంది ప్రయాణికుల్లో 8 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు నాగ్‌పూర్ నుంచి పూణే వెళ్తున్న సమయంలో అగ్నికి ఆహుతైంది.
ఈ ప్రమాదానికి ‘‘మానవ తప్పిదమే’’ కారణమని మహారాష్ట్ర పోలీసులు అనుమానిస్తున్నారు. టైర్ పగిలిపోవడంతో నియంత్రణ కోల్పోయిన డివైడర్ ని ఢీకొట్టిందని, ఆ తరువాత బస్సుకు మంటలు అంటుకున్నాయని డ్రైవర్ చెప్పాడు. అయితే ఇందుకు విరుద్ధంగా డ్రైవర్ నిద్రమత్తులో ఉన్న సమయంలో ప్రైవేట్ స్లీపర్ కోచ్ అయిన బస్సుపై నియంత్రణ కోల్పోయిన ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. డిజిల్ ట్యాంకర్ పగిలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక నివేదిక చెబుతోంది.
Also Read
- Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- RSS: ఆర్ఎస్ఎస్, హిజ్బుల్ ముజాహిదీన్ ఒకటే.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
- BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
నాగ్‌పూర్ నుంచి పూణేకి మొత్తం 33 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. తెల్లవారుజామున 1.30 గంటలకు సింధ్‌ఖేడ్రాజా సమీపంలోని పింపాల్‌ఖుటా గ్రామంలో బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు డ్రైవర్, క్లీనర్ తో సహా 8 మంది పగిలిన కిటీకీల నుంచి బయటకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన 25 మంది సజీవ దహనమయ్యారు. బస్సు ముందుగా యవత్మాల్ జిల్లా కరంజా వద్ద భోజనం కోసం ఆగింది. కేవలం రెండున్నర గంటల్లోనే బస్సు ఏకంగా 150 కిలోమీటర్ల ప్రయాణించినట్లు తెలుస్తోంది. బస్సు యావరేజ్ స్పీడ్ గంటకు 60-70 కిలోమీటర్లు ఉందని పోలీసులు తెలిపారు.
బస్సు వేగం ప్రమాదానికి కారణం కాకపోయి ఉండొచ్చని.. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని తెలుస్తోందని పోలీసులు వెల్లడిస్తున్నారు. డ్రైవర్ నిద్రపోయి ఉండొచ్చని.. బస్సు ముందుగా కుడి వైపు వెళ్లి ఆ తరువాత క్రాష్ బారియర్ను, ఆపై డివైడర్ ని ఢీకొట్టిందని అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలో టైర్ పగిలిన ఆనవాళ్లు, టైర్ గుర్తులు, రబ్బర్ ముక్కలు లేవని అమరావతి ప్రాంతీయ రవాణా కార్యాలయం నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
-
AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
-
Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!