Biryani: ఈస్ట్ ఆర్ వెస్ట్ “బిర్యానీ” ఈస్ బెస్ట్.. ఏకంగా 7.6 కోట్ల బిర్యానీ ఆర్డర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Biryani: బిర్యానీ ఈ పేరు వింటే చాలు నోట్లో లాలాజలం లీకవుతుంది. అంతగా ఈ బిర్యానీకి మన ప్రజలు అలవాటయ్యారు. ఇప్పటికీ మనం రెస్టారెంట్లకు వెళ్తే ముందుగా గుర్తొచ్చే పదం బిర్యానీనే. ఇది లేకుండా ప్రస్తుతం ఏ పార్టీ కూడా ఫినిష్ కావడం లేదు. జూన్ 2 ‘ఇంటర్నేషనల్ బిర్యానీ డే’ సందర్భంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫాం స్విగ్గీ ఓ నివేదికను విడుదల చేసింది. గత 12 నెలల్లో ఏకంగా 7.6 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ పేర్కొంది.
జనవరి 2023 నుండి జూన్ 15, 2023 వరకు చేసిన స్విగ్గీ ఆర్డర్లను పరిశీలిస్తే ఏకంగా 8.26 శాతం బిర్యానీ ఆర్డర్లు పెరిగాయి. 2022 ఇదే కాలంతో పోలిస్తే గత ఐదున్నర నెలల్లో బిర్యానీ ఆర్డర్‌లలో ఈ వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. ప్లాట్‌ఫారమ్ ద్వారా బిర్యానీని అందించే 2.6 లక్షల రెస్టారెంట్లు ఉంటే 28 వేలకు పైగా రెస్టారెంట్లు ఈ బిర్యానీల్లో ప్రఖ్యాతిని కలిగి ఉన్నాయి. లక్నో బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ, మలబార్ బిర్యానీ ఇలా దేశవ్యాప్తంగా ప్రజలు నిమిషానికి 216 బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నట్లు వెల్లడించింది.
Also Read
- Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
బెంగళూర్ నగరంలో అత్యధికంగా 24,000 రెస్టారెంట్లు బిర్యానీ అందిస్తున్నాయి. బెంగళూర్ తర్వాత 22,000 కంటే ఎక్కువ రెస్టారెంట్లలో ముంబై రెండోస్థానంలో.. 20,000 కంటే ఎక్కువ రెస్టారెంట్లలో ఢిల్లీ మూడోస్థానంలో ఉన్నాయి. బిర్యానీ ప్రియుల విషయానికి వస్తే అత్యధికంగా హైదరాబాద్ నగరంలోనే ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది జూన్ వరకు 72 లక్షల ఆర్డర్లలో హైదరాబాదీలు బిర్యానీ లవర్స్ అనిపించుకున్నారు. ఆ తరువాతి స్థానంలో 50 లక్షల ఆర్డర్లతో బెంగళూర్ రెండోస్థానంలో, 30 మిలియన్ల ఆర్డర్లలో మూడోస్థానంలో ఉంది.
62 లక్షల ఆర్డర్లు.. 85 వేరియంట్లలో దమ్ బిర్యానీ అత్యంత ప్రజాధరణ పొందినట్లుగా స్వీగ్గీ డేటా వెల్లడిస్తోంది. హైదరాబాద్ బిర్యానీకి 28 లక్షల ఆర్డర్లు వచ్చాయి. చెన్నైకి చెందిన ఓ బిర్యానీ లవర్ ఏకంగా రూ.31,532 బిర్యానీ ఆర్డర్లకు వెచ్చించాడు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!