Kedarnath temple: హిందువులకు ఎంతో ఆరాధ్యమైన పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం ముందు ఓ జంట ప్రపోజ్ చేయడం, ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడం వివాదాస్పదమైంది. భక్తులు ఎంతో శ్రద్ధగా వచ్చే ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి పనులు ఏంటని భక్తులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం ముందు ఒక మహిళ యూట్యూబర్ తన ప్రియుడికి ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ కావడంతో బద్రీ-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్రంగా పరిగణించింది.
Read Also: Monkey snatches bag: రూ.1 లక్ష ఉన్న బ్యాగ్‌ని లాక్కెళ్లిన కోతి.. ఆ తర్వాత ఏ జరిగిందంటే..?
ఈ ఘటనపై ఆలయ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలయ ప్రాంగణంలో వీడియోలు తీసే వ్యక్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు లేఖ రాసింది. ఇది ఆలయ పవిత్రతను ప్రభావితం చేస్తాయని లేఖలో పేర్కొంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించే వారిపై కఠినమైన నిఘా ఉండాలని పోలీసులను కోరింది. ఈ వీడియోపై స్పందించిన బద్రీ-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఇలాంటి వీడియోలను రూపొందించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు లేఖ రాసింది. యూట్యూబర్‌లు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కేదార్‌నాథ్ ఆలయానికి సమీపంలో వీడియోలు సృష్టించి భారత్‌తోపాటు విదేశాల్లోని భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కమిటీ పేర్కొంది. వివాహ ప్రతిపాదనకు దేవాలయం సరైన స్థలమా అనే చర్చకు ఈ సంఘటన దారి తీసింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి తన ప్రియుడితో కలిసి నడుస్తూ.. మోకాలిపై వంగి ప్రియుడికి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేస్తుంది. ఈ సన్నివేశంలో అక్కడ ఉన్న భక్తులు ఆశ్చర్యపోయారు. కొంతమంది దీన్ని ఫోన్లలో బంధించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిద్దరిపై విమర్శలు వెల్లువెత్తాయి.
Kedarnath Woman proposal video row.After Woman proposal video to her boyfriend at Kedarnath temple gone viral , Kedarnath temple commitee had written a letter to police requesting them to keep a strict watch on people making youtube videos #Kedarnath #kedarnathdham #ViralVideos pic.twitter.com/C94km1ZfVU
— Preeti Sompura (@sompura_preeti) July 5, 2023