Tata Motors: మైలేజీ టెస్ట్‌లో టాటా హారియర్, సఫారీ పెట్రోల్ వెర్షన్లు సంచలనం.. లాంఛ్‌కు ముందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Motors: భారత్‌లో అధికారిక లాంచ్‌కు ముందే హారియర్, సఫారి ఎస్‌యూవీల కొత్త పెట్రోల్ వెర్షన్లను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఈ రెండు మోడళ్లలో కంపెనీ కొత్త 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించింది. దీనికి ‘హైపీరియన్’ అనే పేరు పెట్టారు. ఇదే ఇంజిన్‌ను ఇటీవల ఆల్-న్యూ సియెర్రా మోడల్‌తో పరిచయం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలోని నాట్రాక్స్ (NATRAX) టెస్ట్ ట్రాక్‌లో హారియర్, సఫారి ఎస్‌యూవీలను పరీక్షించిన వీడియోను టాటా మోటార్స్ విడుదల చేసింది. ఈ పరీక్షల్లో వాస్తవ రోడ్ పరిస్థితుల్లో వాహన పనితీరును పూర్తిగా ప్రతిబింబించవని కంపెనీ స్పష్టం చేసింది. వీడియోలో ‘హైపీరియన్’ బ్యాడ్జింగ్ ఉన్న ఎరుపు రంగు హారియర్ ముందుగా కాలిబ్రేషన్ తర్వాత ట్రాక్‌పైకి వెళ్తుంది. దాని వెనక అదే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో ఉన్న సఫారి రెడ్ డార్క్ ఎడిషన్‌ను కూడా పరీక్షించారు.
READ MORE: Meena Daughter: హీరోయిన్లను తలదన్నే అందంతో మీనా కూతురు.. షాకింగ్ ఫోటో లీక్ని?
Also Read
- New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
- Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
టాటా మోటార్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పరీక్షల్లో సఫారి గరిష్ఠంగా గంటకు 216 కిలోమీటర్ల వేగాన్ని సాధించింది. ఇంధన సామర్థ్యం విషయంలోనూ మంచి ఫలితాలు వచ్చాయి. హారియర్ లీటర్‌కు 25.9 కిలోమీటర్ల మైలేజ్ నమోదు చేయగా, సఫారి 25 కిలోమీటర్ల మైలేజ్ సాధించింది. హారియర్ మైలేజ్‌ను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారికంగా గుర్తించింది. భారత్‌లో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉన్న పెట్రోల్ ఎస్‌యూవీలో రికార్డు మైలేజ్. ఈ రెండు ఎస్‌యూవీలకు శక్తినిచ్చేది 1.5 లీటర్, నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 170 హెచ్‌పీ పవర్, 280 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ మోడళ్ల అధికారిక లాంచ్, ధరల వివరాలు వచ్చే నెలలో ప్రకటించే అవకాశం ఉంది.
READ MORE: Visceral Fat Reduction: శరీరంలో పేరుకుపోయిన కొవ్వును ఎలా తగ్గించుకోవాలో తెలుసా..
కాగా అదే హైపీరియన్ ఇంజిన్‌ను అమర్చిన సియెర్రా మోడల్‌ను సైతం నాట్రాక్స్‌లో పరీక్షించారు. ఇది కేవలం 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ప్యాడిల్ షిఫ్టర్లతో మాత్రమే వస్తుంది. 12 గంటల ఎండ్యూరెన్స్ రన్‌లో ఈ వాహనం లీటర్‌కు 29.9 కిలోమీటర్ల మైలేజ్ సాధించింది. మరో పరీక్షలో గరిష్ఠంగా గంటకు 222 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది. అయితే ఇవన్నీ నియంత్రిత పరిస్థితుల్లో చేసిన పరీక్షల ఫలితాలు మాత్రమేనని, వాస్తవ వినియోగంలో ఫలితాలు భిన్నంగా ఉండొచ్చని టాటా మోటార్స్ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..