Tamil Nadu: తమిళనాడులో టాప్ పోలీస్ ఆఫీసర్ పిస్టల్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2009 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ శుక్రవారం కోయంబత్తూర్ నగరంలో తన నివాసంలో డ్యూటీలో ఉన్న సెక్యురిటీ అధికారి నుంచి పిస్టల్ తీసుకుని, కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. విజయ్ కుమార్ ప్రస్తుతం కోయంబత్తూర్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
Richest Beggar: బిచ్చమెత్తుకుంటూ రూ. 7.5 కోట్లు సంపాదించాడు ఓ వ్యక్తి. ప్రపంచంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన బిచ్చగాళ్ల జాబితాలో చేరారు. నెలకు రూ. 60 వేల నుంచి రూ.75 వేల వరకు సంపదిస్తూ ఈ ఖ్యాతి గడించాడు. అతను ఎవరో కాదు మన దేశానికి చెందిన భరత్ జైన్.
El Nino:వాతావరణ నిపుణులు అంచనా వేసినట్లుగానే పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ ఏర్పడింది. ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ఏర్పడినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావం వల్ల అనేక దేశాల్లో ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.
Bihar: ఇటీవల వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్నాయి. కొన్ని కేసుల్లో మహిళలు తమ ప్రియుడితో కలిసి భర్తలను హత్య చేస్తుంటే, మరికొన్ని కేసుల్లో భర్తలు, భార్యలను హత్య చేస్తున్నారు. ఇలా వివాహేతర సంబంధాలు విషాదంగా మిగులుతున్నాయి. ఇందుకు భిన్నంగా ఓ వ్యక్తి మాత్రం తన భార్యకు ఆమె ఇష్టపడిని వ్యక్తితో పెళ్లి జరిపించాడు. దగ్గరుండీ మరీ ఇద్దరి పెళ్లి చేశాడు. సినిమాల్లో సాధ్యమయ్యే ఇలాంటి సన్నివేశాలు ఇప్పడు రియల్ లైఫ్ లో కూడా జరుగుతాయని నిరూపించాడు.
Uddhav Thackeray: మహరాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. కొన్నాళ్లుగా మహారాష్ట్రలో శివసేన అంశంపై రాజకీయాలు నడుస్తుంటే.. తాజాగా ఎన్సీపీలో చీలిక తాజా అంశంగా మారింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కి షాక్ ఇస్తూ అజిత్ పవార్ అసమ్మతి గళమెత్తాడు.
Lightning strikes: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులపాటు కారణంగా ఇద్దరు చిన్నారులతో సహా ఏడుగురు మరణించారు. బుదౌన్, ఇలాహ్, రాయ్ బరేలీ జిల్లాల్లో పిడుగుపాటు ఘటనలు నమోదయ్యాయి. గురువారం వివిధ ప్రాంతాల్లో జరిగిన పిడుగుపాటు ఘటనల వల్ల ఏడుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
Australia: ఆస్ట్రేలియా లోని 21 ఏళ్ల భారతీయ నర్సింగ్ విద్యార్థిని జాస్మీన్ కౌర్ ను ఆమె మాజీ లవర్ దారుణంగా హత్య చేశాడు. 2021లో ఆమె లవర్ తారిక్జోత్ సింగ్ ఆమెను కిడ్నాప్ చేసి ప్రాణం ఉండగానే పూడ్చి పెట్టాడు. ప్రతీకారంతో తారిక్జోత్ సింగ్ యువతిని దారుణంగా హత్య చేసిన కేసును అక్కడి కోర్టు బుధవారం విచారించింది.
Gurpatwant Singh Pannun: కరుడుగట్టిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బతికే ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చుతూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) చీఫ్గా ఉన్న ఇతను నిత్యం భారతదేశంపై విషం చిమ్ముతూనే ఉన్నాడు.
Nepal: నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్(ప్రచండ) చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే నేపాల్ రాజకీయాలు అస్థిరంగా ఉన్నాయి. తాజాగా పీఎం దహల్ చేసిన వ్యాఖ్యలు అక్కడ అగ్గిని రాజేశాయి