Parliament Session: కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజలు పాటు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. అయితే ఈ సమావేశాలపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ముఖ్యంగా వినాయక చతుర్థి సమయంలో సమావేశాలను నిర్వహించడంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి.
Read Also: Sonia Gandhi: ఇండియా కూటమి సమావేశానికి సోనియా, రాహుల్ గాంధీ
అయితే.. ఈ సమావేశాలు పాత పార్లమెంట్ లో మొదలై, కొత్త పార్లమెంట్ భవనంలో ముగుస్తాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గణేష్ చతుర్థి సందర్భంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తేదీలను ప్రకటించడం తమను ఆశ్చర్యానికి గురిచేస్తోందని శివసేన(ఉద్ధవ్) ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. హిందువుల మనోభావాలకు విరుద్ధంగా ఈ తేదీలను ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగించిందని ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
గణేష్ చతుర్థి ఉంది కాబట్టి సమావేశాల తేదీలను మార్చాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు. అయితే కేంద్రం ఈ సమావేశాల ఎజెండా ఏమిటనేది ప్రకటించలేదు.