Akshay Khanna: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తున్న సినిమా ‘ధురంధర్’. ఈ సినిమాలో స్టార్ హీరో రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటించి, ప్రతినాయకుడిగా నటుడు అక్షయ్ ఖన్నా సూపర్ యాక్షన్ అదరగొట్టాడు. ఇప్పటికే ధురంధర్.. 2025లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు అక్షయ్ ఖన్నా. అయితే ఈ నటుడు ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. ఇంతకీ ఆయన ఏ చిక్కుల్లో పడ్డాడు, దానికి గల కారణాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Bus Accident : సంగారెడ్డిలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. 22 మందికి గాయాలు.!
అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం దృశ్యం 3. ఇది 2026, అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. ఈ చిత్రంలో నటి శ్రియ శరణ్, రజత్ కపూర్, టబు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ధురంధర్ చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న అక్షయ్, దృశ్యం 2లో భాగమైన విషయం తెలిసిందే. తాజాగా ఆయనపై ‘దృశ్యం 3’ నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ దావా వేసి, లీగల్ నోటీసు పంపించారు. ఈ సందర్భంగా ‘దృశ్యం 3’ నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం అక్షయ్ ఖన్నాకు, తమ మధ్య ఒప్పందం జరిగింది. ఆ టైంలోనే కొంతమొత్తంలో అడ్వాన్స్ కూడా చెల్లించా. ఇప్పుడు చూస్తే అక్షయ్ ఖన్నా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఒక టెక్ట్స్ మెసేజ్ పంపించి, ఆయన ఈ చిత్రంలో భాగం కావడం లేదని చెప్పారు. అతడిని సంప్రదించాలని ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. ఇది షూటింగ్‌పై ప్రభావం పడటంతో ఆయన ప్లేస్‌లో జైదీప్ అహ్లావత్‌ను రీపేస్ చేశాం’ అని అన్నారు. అయితే ఈ కామెంట్స్‌పై అక్షయ్ టీమ్ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు.
READ ALSO: New Year Celebration Ideas: ఈ న్యూ ఇయర్‌కి ప్లాన్స్ ఏం లేవా? ఇవి ట్రై చేయండి..