Aditya-L1: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్ దిగ్విజయంగా తన లక్ష్యం వైపు కదులుతోంది. సూర్యుడిపై పరిశోధనలకు చేయడానికి ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇది. తాజాగా ఆదిత్య ఎల్1 ఆన్ బోర్డ్ కెమెరాల సాయంతో సెల్ఫీ తీసింది. దీంతో భూమి, చంద్రుడు కనిపించడం చూడొచ్చు. చంద్రుడు భూమికి కుడి వైపున చిన్న చుక్కలా ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసింది.
సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ఆదిత్య ఎల్1ని తీసుకెళ్లింది. చంద్రయాన్-3 సక్సెస్ అయిన తర్వాత ఇస్రో కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ సోలార్ మిషన్‌ని ప్రయోగించింది. భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న ఆదిత్య ఎల్1 శాటిలైట్ కక్ష్యను రెండుసార్లు విజయవంతంగా ఇస్రో పెంచింది.
Read Also: Babar Azam: విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్!
ఇలా పలు దఫాలుగా కక్ష్యను పెంచి భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటే వేగం వచ్చిన తర్వాత ఆదిత్య ఎల్ 1 భూమి, సూర్యుడు మధ్య ఉండే లాంగ్రేజ్ పాయింట్ 1(L1) వద్దకు ప్రయాణమైంది. ఇది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎల్1 పాయింట్ వద్ద హాలో కక్ష్యలో తిరుగుతూ సూర్యుడి కరోనా, మాగ్నెటిక్ ఫీల్డ్, సౌర తుఫానులపై అధ్యయనం చేయనుంది. అక్కడికి చేరుకునేందుకు దాదాపుగా ఆదిత్య ఎల్ 1కి 4 నెలల సమయం పడుతుంది. ఎల్1 పాయింట్ వద్ద సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి సమతుల్యంగా ఉంటుంది. అందుకే ఆదిత్య ఎల్ 1ని అక్కడ ఉంచుతున్నారు.
Aditya-L1 Mission:
👀Onlooker!Aditya-L1,
destined for the Sun-Earth L1 point,
takes a selfie and
images of the Earth and the Moon.#AdityaL1 pic.twitter.com/54KxrfYSwy— ISRO (@isro) September 7, 2023