GST Effect: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో, మార్కెట్‌లో కొనుగోళ్ల ప్రభావం కనిపిస్తోంది. పండగ సీజన్ కూడా కావడంతో మార్కెట్ లో సందడి నెలకొంది. సామాన్యుడికి అవసరమైన నిత్యావసరాలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, బైకులు, కార్లపై గతంలో 28 శాతం ఉన్న జీఎస్టీని కేంద్రం 18 శాతానికి తగ్గించింది. తగ్గించిన జీఎస్టీ సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చింది. దీంతో, తగ్గిన ధరల కారణంగా తమకు అవసరమయ్యే వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు నవరాత్రి, దీపావళి పండగకలు కూడా మార్కెట్‌కు ఊపునిచ్చింది.
Read Also: Viral Video: ఇదే నా పేరు.. ఏం పీ*టావో పీ*క్కో.. ఫిర్యాదుదారులపై మహిళా పోలీసు దౌర్జన్యం(వీడియో)
ఆల్ టైం హైకి ఆటోమొబైల్స్ అమ్మకాలు:
కొత్త పన్ను విధానంతో వినియోగదారులు కార్లు, బైకుల్ని కొనుగోలు చేస్తున్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ ఎప్పుడూ లేని విధంగా కొనుగోళ్లను చూస్తోంది. 4 మీటర్ కార్లు 18 శాతం పన్ను స్లాబ్‌లోకి మార్చడంతో ధరలు తగ్గాయి. దీంతో దేశవ్యాప్తంగా షోరూంలలో సందడి నెలకొంది. మారుతి 80,000 ఎంక్వైరీలను, 30,000 డెలివరీలతో 35 ఏళ్లలో అత్యుత్తమ సింగిల్ డే పనితీరును నమోదు చేసింది. సాధారణ పండగ సీజన్లతో పోలిస్తే చిన్న కార్ల బుకింగ్స్ 50 శాతం పెరిగాయి.
సెప్టెంబర్ 22న డీలర్ బిల్లింగ్స్ 11,000 పెరగడంతో హ్యుందాయ్ కూడా 5 ఏళ్ల తర్వాత అత్యుత్తమ రోజును చూసింది. టాటా మోటార్స్ ఏకంగా 10,000 కార్లను డెలివరీ చేసింది. 25,000 కన్నా ఎక్కువ ఎంక్వైరీలు నమోదైనట్లు చెప్పింది.
ఈ-కామర్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులకు డిమాండ్:
ఈ కామర్స్‌లో బట్టల దగ్గర నుంచి నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లు పెరిగాయి. దీనికి తోడు ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌లు తమ సేల్స్‌ని ప్రకటించడంతో కొనుగోళ్లు పెరిగాయి. దీనికి జీఎస్టీ కూడా తోడవ్వడంతో వస్తువుల ధరలు మరింత తగ్గాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ ట్రాఫిక్ గత వారంతో పోలిస్తే 151 శాతం పెరిగింది.
పండగ సీజన్ కావడంతో కొత్త టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్స్ వంటి వాటిని వినియోగదారుడు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఏసీల ధరలు ఏకంగా రూ. 3000- రూ.5000 వరకు తగ్గాయి. హై ఎండ్ టీవీల ధరలు ఏకంగా రూ. 85000 వరకు తగ్గాయి.
హైయర్ కంపెనీ సోమవారం సాధారణ అమ్మకాల కంటే దాదాపు రెట్టింపు అమ్మకాలను నమోదు చేసింది. కొత్త రేట్లు అమలులోకి రాకముందే ప్రీ బుకింగ్స్ జరిగాయి. బ్లూ స్టార్ తన మొదటి రోజు అమ్మకాలను గతేడాదితో పోలిస్తే 20 శాతం పెరిగినట్లు చెప్పింది. ముఖ్యంగా 43- ఇంచ్, 55- ఇంచ్ టీవీల అమ్మకాలు భారీగా పెరిగాయి.