India Russia: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, భారత్ పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తుందనే ఆరోపణతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాన్ని విధించాడు. అయితే, దీనిపై నాటో ఛీఫ్ మార్క్ రుట్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాల దెబ్బ మోడీకి తగిలిందని, అందుకే మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడారని, యుద్ధ వ్యూహాలను అడిగారని అన్నారు.
Pak PM: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణం అని, తానే మధ్యవర్తిత్వం చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్నారు. అయితే, ఇప్పుడు అదే మాటను పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా చెప్పుకుంటున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు వైట్ హౌజ్‌లో ట్రంప్‌తో సమావేశమయ్యారు.
Sonam Wangchuk: పర్యావరణ కార్యకర్త, లడఖ్ రాష్ట్ర హోదాకు డిమాండ్ చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను శుక్రవారం పోలీసుల అరెస్ట్ చేశారు. రాష్ట్ర హోదా కోరుతూ, రెండు రోజుల క్రితం లడఖ్ వ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు మరణించారు.
Ravindra Kaushik: ఒక వ్యక్తి మొత్తం పాకిస్తాన్ ఆర్మీకి, ఆ దేశానికి భయం అంటే ఏంటో చూపించాడు. వారి ఆర్మీలోనే ఉంటూ, భారతదేశానికి పనిచేసిన గొప్ప వ్యక్తి, ‘‘బ్లాక్ టైగర్’’గా కొనియాడబడిన రవీంద్ర కౌశిక్ ధైర్యం, తెగువ చాలా మందికి ఆదర్శం. భారత గూఢచారిగా ఆయన చేసిన సేవలు ఇప్పటికీ, నిఘా ఏజెన్సీలకు గర్వకారణం. అయితే, ఎప్పటికైనా ఒక గూఢచారిని కలవరపెట్టే అంశం, తన ముసుగు తొలిగిపోవడం. రవీంద్ర కౌశిక్‌కు కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఎవరు […]
Muhammad Yunus: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. న్యూయార్క్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. గతేడాది బంగ్లాదేశ్ వ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనను, షేక్ హసీనా పదవీచ్యుతురాలు కావడాన్ని భారత్ ఇష్టపడలేదని ఆయన అన్నారు.
Sonam Wangchuk: రాష్ట్ర హోదా కోరుతూ, లడఖ్ వ్యాప్తంగా హింసాత్మక అల్లర్లు జరిగాయి. భద్రతా బలగాలు, బీజేపీని టార్గెట్ చేస్తు ఆందోళనకారులు హింసకు పాల్పడ్డారు. ఈ అల్లర్లలో నలుగురు మరణించారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు.ఈ అల్లర్లు ఉద్దేశపూర్వకంగా చేయబడ్డాయని లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా ఆరోపిస్తూ, లేహ్ వ్యాప్తంగా ఖర్ఫ్యూ విధించారు. అల్లర్ల వెనక ఉన్న ప్రతీ వ్యక్తిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Swami Chaitanyananda Saraswati: న్యూఢిల్లీలోని ప్రముఖ విద్యా, ఆధ్యాత్మిక సంస్థలో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి. వసంత్ కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ డైరెక్టర్, తనను తాను ‘‘బాబా’’గా చెప్పుకుునే స్వామి చైతన్యానంద సరస్వతి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కేసుపై పోలీసులు విస్తృత దర్యాప్తును ప్రారంభించారు.
UP: ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. వ్యసనానికి బానిస అయిన ఓ వ్యక్తిని ‘‘డి అడిక్షన్ సెంటర్’’కు పంపిస్తే.. స్పూన్లు, టూత్ బ్రెష్‌లు తినడానికి బానిసగా మారాడు. కోపంతో ఉన్న అతను ప్రతీ రోజూ స్పూన్లు, టూత్ బ్రెష్‌లను దొంగిలిస్తూ, వాటిని ముక్కలుగా చేసి, నోట్లో నుంచి కడుపులోకి తోసేసే వాడు.
Malegaon blasts case: 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో ఒకరైన లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ నిర్దోషిగా విడుదలయ్యారు. నిర్దోషిగా విడుదలైన తర్వాత ఆయనకు “కల్నల్”గా ప్రమోషన్ లభించింది. జూలై 1న ప్రత్యేక NIA కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన ఏడుగురు నిందితులలో శ్రీ పురోహిత్ కూడా ఉన్నారు. కేవలం అనుమానం మాత్రమే సాక్ష్యాన్ని భర్తీ చేయదని […]
CDS Anil Chauhan: త్రివిధ దళాధిపతి, సీడీఎస్ అనిల్ చౌహాన్ 1962 ఇండియా-చైనా యుద్ధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో భారత వైమానిక దళాన్ని ఉపయోగించి ఉంటే కథ వేరుగా ఉండేదని అన్నారు. వైమానిక దళం ఉపయోగించడం వల్ల చైనా దాడి తగ్గేదని చెప్పారు. వైమానిక దళాన్ని ఉపయోగించడం ఉద్రిక్తతల్ని పెంచడం అవుతుందని కొందరు భావిస్తారు, కానీ ఆపరేషన్ సిందూర్ సమయంలో అలా జరగలేదని నిరూపితం అయిందని అనిల్ చౌహాన్ బుధవారం అన్నారు.