Hacking: హ్య‘కింగ్’ వీడు.. రూ. 4 కోట్లు స్వాహా చేసిన ఏపీ ట్రిపుల్ ఐటీ గ్రాడ్యుయేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hacking: ట్రిపుల్ ఐటీ విద్యార్థులు టెక్నాలజీ పరంగా చాలా అత్యుత్తమంగా ఉంటారు. ఈ టెక్నాలజీని సరైన పనులు ఉపయోగిస్తే సాంకేతిక ప్రపంచాన్ని దున్ని పారెయెచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీ-ఒంగోలుకు చెందిన కంప్యూటర్ సైన్ గ్రాడ్యుయేట్ 23 ఏళ్ల యువకుడు మాత్రం దీన్ని అక్రమమార్గంలో ఉపయోగించాడు. చివరకు కటకటాల పాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే ఏపీకి చెందిన ట్రిపుల్ ఐటీ గ్రాడ్యుయేట్ బొమ్మలూరు లక్ష్మీపతి ఓ వెబ్‌సైట్ ని హ్యాకింగ్ చేసి రూ.4.16 కోట్ల విలువైన రివార్డ్ పాయింట్లను స్వాహా చేశాడు. నిందితుడు ఏకంగా 6 లక్షల గిఫ్ట్ వోచర్లను రీడీమ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. లక్ష్మీపతిని అరెస్ట్ చేసినట్లు బెంగళూర్ పోలీస్ కమిషనర్ బీ దయానంద ప్రకటించారు. అతడి నుంచి 5 కిలోల బంగారంతో సహా రూ. 4.16 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది బెంగళూర్ సైబర్ క్రైమ్ పోలీసులు జరిపిన అతిపెద్ద సీజ్ ఇదే అని పోలీసులు తెలిపారు.
Also Read
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
ఏపీకి చెందిన లక్ష్మీపతి ఒంగోలులోని ట్రిపుల్ ఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బెంగళూర్ లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరినట్లు పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ లో ఈ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తరువాత దుబాయ్ లో కొన్ని నెలలు పనిచేసి బెంగళూర్ తిరిగి వచ్చాడు. లక్ష్మీపతి కాలేజ్ రోజుల్లోనే హ్యాకింగ్ నేర్చుకున్నాడని పోలీసులు తెలిపారు. తన టాలెంట్ పరీక్షించుకునేందు9కు లాయల్టీ, రివార్డ్ ప్రోగ్రామ్స్ నిర్వహించే రివార్డ్ 360 సంస్థపై పరీక్షించాడు. ఏకంగా 6 నెలల పాటు వెబ్‌సైట్ ని హ్యాక్ చేసి గిఫ్ట్ వోచర్లను తన అకౌంట్ లో జమ చేసుకున్నాడు.
Read Also: Nitin Gadkari: కార్లలో 6 ఎయిర్‌బ్యాగులను తప్పనిసరి చేయబోం..
పోలీసులు కథనం ప్రకారం, లక్ష్మీపతి క్రెడిట్ కార్డు సమస్య రావడంతో తన బ్యాంకును సంప్రదించాడు. సమస్యను పరిష్కరించిన బ్యాంకు అతనికి పరిహారంగా రివార్డ్ 360 వోచర్ ఇచ్చారు. అయితే ఆసక్తిగా లక్ష్మీపతి ఈ రివార్డ్ 360 వోచర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందని పరీక్షించాడు. హ్యాకింగ్ స్కిల్స్ తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ..రివార్డ్ 360 సెక్యూరిటీని ఛేదించాడు. ఎప్పుడూ తాను గిఫ్ట్ వోచర్లు పొందేలా కోడ్ రూపొందించాడని పోలీసులు తెలిపారు.
బంగారం, వెండి, బైకుల కొనుగోలు చేయడానికి తన గిఫ్ట్ ఓచర్లను రీడీమ్ చేయడం ప్రారంభించాడు. డబ్బును సంపాదించి సైబర్ సెక్యూరిటీ సంస్థను ప్రారంభించడం లేదా దుబాల్ లో స్థిరపడాలని అనుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ఒక నెల క్రితం రివార్డ్ 360 ఖాతాదారులు వోచర్లను రీడీమ్ చేయలేకపోవడంతో ఫిర్యాదులు చేశారు. దీంతో ఈ సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. అన్ని వోచర్లు ఒకే అకౌంట్ కు రీడీమ్ అయినట్లు తేలింది. జూన్ 24న పోలీసులను ఆశ్రయించగా.. లక్ష్మీపతి ఉదంతం వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!