State Elections: ఈ ఏడాది చివర్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల ముందు అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ముఖ్యంగా జాతీయపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం ఉన్నాయి. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Anurag Thakur: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే నేత, రాష్ట్రమంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు ఇంకా చల్లారడం లేదు. బీజేపీ, కేంద్రమంత్రులు డీఎంకే పార్టీపై ఇండియా కూటమిపై విరుచుకుపడుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం ఇండియా కూటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pig kidney In Human: మానవ అవయవాలు విఫలమైతే వేరే వ్యక్తులు దానం చేస్తేనే జీవితం సాఫీగా సాగుతుంది. అయితే కొన్ని సందర్బాల్లో అవయవాలు దొరకకపోవడం, దొరికినా సెట్ కాకపోవడం వల్ల మనుషులు మరణిస్తున్నారు. అవయవాల కొరతకు పరిష్కారం కనుగొనేందుకు శాస్త్రవేత్తలు, వైద్యులు కొన్ని ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇటీవల జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీని మానవుడికి అమర్చారు. ఇది ఏకంగా రెండు నెలల పాటు పనిచేసింది, భవిష్యత్తులపై ఆశలను పుట్టించింది. బ్రెయిన్ డెడ్ అయి, వెంటిలేటర్ పై ఉన్న ఓ వ్యక్తికి పంది…
Nobel Prize: ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ మనీని పెంచనున్నట్లు నోబెల్ ఫౌండేషన్ తెలిపింది. నోబెల్ విజేతలకు ఈ ఏడాది అదనంగా మరో 1 మిలియన్ స్వీడిష్ క్రోనార్లను ఇస్తామని మొత్తంగా 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్లను(9,86,000 డాలర్లను) అందచేస్తామని శుక్రవారం ప్రకటించింది. ఇటీవల సంవత్సరాల్లో ప్రైజ్ మనీ పలుమార్లు సర్దుబాటు చేశారు. ప్రస్తుతం ఫౌండేషన్ ఆర్థిక స్థితి బలంగా ఉన్నందుకు ప్రైజ్ మనీని కూడా పెంచినట్లు తెలిపింది
Karnataka: కర్ణాటకలో ఫ్రెష్ గా మారో వివాదం రాజుకుంది. హుబ్బల్లిలోని వివాాదాస్పద ఈద్గా మైదనంలో గణేష్ విగ్రహానని ప్రతిష్టించడానికి అనుమతి కొరుతూ హిందూ కార్యకర్తలు స్థానిక, జిల్లా పరిపాలనను ఆశ్రయించారు.
Infosys: దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సత్తా చాటింది. టైమ్ వరల్డ్ టాప్ 100 బెస్ట్ కంపెనీల్లో స్థానం సంపాదించింది. భారత్ నుంచి టాప్ 100లో నిలిచిన ఏకైక కంపెనీగా ఉంది. భారతదేశానికి చెందిన మరో 7 కంపెనీలు టాప్ -750 కంపెనీల జాబితాలో ఉన్నాయి.
Bihar: రామచరిత్ మానస్ మరోసారి వివాదాల్లోకి వచ్చింది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య ‘రామచరిత మానస్’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా బీహార్ మంత్రి కూడా హిందూ గ్రంథాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పవిత్ర రామచరితమానస్ గ్రంథాన్ని విషపదార్థమైన ‘సైనైడ్’తో పోల్చాడు. ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు పొలిటికల్ దుమారం ప్రారంభమైంది.
Pakistan: దాయది దేశం పాకిస్తాన్, భారతదేశంపై ద్వేషాన్ని పెంచుకుంటూనే ఉంటుంది. ఇటీవల కాలంలో భారత్ ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతోంది. ముఖ్యంగా గ్లోబల్ పవర్ గా భారత్ ఎదుగుతుంటే.. డాలర్లను అడుక్కునే స్థాయికి పాకిస్తాన్ దిగజారింది. దీంతో భారత సరిహద్దుల్లో నిత్యం అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది.
China: జపాన్ లోని అమెరికా రాయబారి రహమ్ ఇమ్మాన్యుయేల్ ఎక్స్(ట్విట్టర్)లో ఓ పోస్టు చేశారు. ‘మొదటిది రక్షణ మంత్రి లీ షాంగ్ఫు 3 వారాల నుంచి కనిపించడం లేదు. రెండోది అతడిని గృహనిర్భందంలో ఉంచినందుకే వియత్నా పర్యటనలో కనిపించలేదు, సింగపూర్ నేవీ చీఫ్ తో సమావేశం కాలేదు..?’ అంటూ వ్యాఖ్యానించారు.
Nuh communal clashes: హర్యానా నూహ్ ప్రాంతంలో ఆగస్టు నెలలో మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఊరేగింపుగా వెళ్తున్న హిందువులపై కొంతమంది ముస్లింలు కావాలని దాడులకు పాల్పడ్డారు. భవనాలపై రాళ్లు విసరడమే కాకుండా, ఆయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘర్షణల్లో మొత్తం ఆరుగురు మరణించారు.