Russia Warning to Ukraine: ట్రంప్‌తో జెలెన్‌స్కీ భేటీ.. ఉక్రెయిన్‌కి రష్యా అధ్యక్షుడు స్ట్రాంగ్ వార్నింగ్
- నేడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీ..
- ఉక్రెయిన్‌కి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్..
- శాంతియుతంగా పరిష్కరించుకోకపోతే.. సైనిక చర్యలకు దిగుతాం: పుతిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Warning to Ukraine: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతియుత మార్గం ద్వారా సమస్య పరిష్కారానికి కీవ్ ముందుకు రాకపోతే.. సైనిక మార్గాలను అనుసరించాల్సి ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈరోజు ( డిసెంబర్ 28న) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమావేశం కానున్న నేపథ్యంలో.. పుతిన్ ఈ హెచ్చరికలు చేశారు.
Read Also: Fisherman Escapes Crocodile Attack: చేపలు పడుతున్న యువకుడు.. ఒక్కసారిగా మీదికి వచ్చిన..
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
అయితే, రష్యా మిలిటరీ కమాండ్ పోస్టును అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరిసిమోవ్, రష్యన్ దళాలతో కాసేపు ముచ్చటించారు. అనంతరం పుతిన్ మీడియాతో మాట్లాడుతూ.. ఒక వేళ ఉక్రెయిన్ ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోకపోతే.. ప్రత్యేక సైనిక చర్యతో తమ టార్గెట్ ను చేరుకుంటామని వార్నింగ్ ఇచ్చారు శాంతి చర్చలపై కీవ్ అధికారులకు పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్లుంది.. సమస్య పరిష్కారానికి వాళ్లు ఇష్టపడటం లేదన్నారు.
Read Also: Tata Punch Facelift: టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది! ఫీచర్స్, లుక్ అదుర్స్ గురూ..
ఇక, డొనాల్డ్ ట్రంప్‌తో భేటీకి ముందు కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు రష్యా సహకారం అవసరమని కెనడా ప్రధాని కార్నీ అన్నారు. ఉక్రెయిన్ పై తాజాగా మాస్కో జరిపిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. కీవ్ కు అదనంగా 2. 5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ఇవ్వబోతున్నట్లు కార్నీ ప్రకటించారు. అయితే, శనివారం నాడు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా భారీగా డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో దాడులు కొనసాగించింది. ఈ దాడులను జెలెన్‌స్కీ ఖండించారు.
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!