Nagpur: అత్యాచారం కేసు పెడతానని ఓ యువతి, ఆమె కుటుంబ సభ్యులు బ్లాక్‌మెయిల్ చేయడంతో వ్యక్తి ఫేస్‌బుక్ లైవ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగ్‌పూర్ నగరానికి చెందిన 38 ఏళ్ల మనీష్‌ను ఆమె స్నేహితురాలు బ్లాక్‌మెయిల్ చేసింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా భయపెట్టడంతో మనీష్ తనువు చాలించాడు. సెప్టెంబర్ 10న 38 ఏళ్ల వ్యక్తి మనీష్ తన ఫేస్‌బుక్ లైవ్‌లో, 19 ఏళ్ల కాజల్ అనే అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులచే అత్యాచారం ఆరోపణలతో బెదిరిస్తున్నట్లు చెప్పాడు.
Read Also: Indian student’s death: తెలుగు యువతి మృతిపై దర్యాప్తు చేయాలి.. అమెరికాను కోరిన ఇండియా..
మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు రూ. 5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని.. ఇవ్వకపోతే కేసు పెడతామని బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. సెప్టెంబర్ 6న కాజల్ ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే ఆమె మనీష్ తో కలిసి పారిపోయిందని కుటుంబ సభ్యుల ఆరోపించారు.
పెళ్లై ముగ్గురు పిల్లలకు తండ్రైన మనీష్, సదరు మహిళ కుటుంబ సభ్యల వేధింపులు తట్టుకోలేక నాగ్‌పూర్ లో ఓ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.మహిళతో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని చెప్పాడు. తన మరణానికి మహిళ, ఆమె కటుంబ సభ్యులు, ఓ ఫోటో స్టూడియో ఆపరేటర్ కారణమని ఫేస్‌బుక్ లైవ్ లో ఆరోపించారు. ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు నదీలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.