Anant Shastra: పాకిస్తాన్, చైనా సరిహద్ధుల్ని మరింత బలోపేతం చేయడానికి భారత సైన్యం సిద్ధమవుతోంది. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో వైమానిక రక్షణ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి భారత సైన్యం ఐదు నుంచి ఆరు రెజిమెంట్ల ‘‘ అనంత శస్త్ర’’ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయడానికి టెండర్ జారీ చేసింది.
India At UN: ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అబద్ధాలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. నిన్న యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో షరీఫ్ మాట్లాడుతూ.. తాము ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌ను ఓడించామని ప్రగల్భాలు పలికారు. ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించిందని చెప్పుకొచ్చారు. ట్రంప్ శాంతి కాముకుడని, ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది. హిందుత్వ ఉగ్రవాదం ప్రపంచానికి ప్రమాదకరమని అసత్యాలను ప్రచారం చేశాడు.
Pakistan: శుక్రవారం రోజు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌పై విషం వెళ్లగక్కాడు. ఐక్యరాజ్యసమితి వేదికగా అన్ని అబద్ధాలనే ప్రచారం చేశాడు. జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశంపై తామే గెలిచామంటూ, భారతదేశాన్ని శత్రువుగా అభివర్ణించాడు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని పేర్కొన్నాడు. పహల్గామ్ దాడిపై నిష్పాక్షిక అంతర్జాతీయ దర్యాప్తు కోసం తాను విజ్ఞప్తి చేశానని, కానీ భారతదేశం ఆ ప్రతిపాదనను తిరస్కరించి, ఈ విషాదాన్ని రాజకీయంగా ఉపయోగించుకుందని ఆరోపించాడు.
Pakistan: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. భారతదేశ ‘‘హిందుత్వ’’ తీవ్రవాదం ప్రపంచానికి ప్రమాదమని అబద్ధాలను ప్రచారం చేశాడు. పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశం అని చెబుతూ, జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ సంఘటనను ప్రస్తావిస్తు ‘‘హిందుత్వ తీవ్రవాదం’’ ప్రపంచానికి ముప్పు కలిగిస్తుందని ఆరోపించాడు.
Netanyahu: ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు చేదు అనుభవం ఎదురైంది. ఓ రకంగా చెప్పాలంటే అవమానం. శుక్రవారం ఆయన ప్రసంగించే సమయంలో చాలా దేశాల ప్రతినిధులు, రాయబారులు సామూహికంగా వాకౌట్ చేశారు. గాజాలో ఇజ్రాయిల్ చేపట్టిన సైనిక చర్యకు వ్యతిరేకంగా వారు నిరసన తెలిపారు. నెతన్యాహూ ప్రసంగం కొనసాగుతుంటేనే ఒక్కొక్కరుగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.
USA: పాకిస్తాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తాకింది. పాకిస్తాన్లో చమురు నిల్వలు ఉన్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో ప్రకటన చేశాడు. పాకిస్తాన్లో బిలియన్ల విలువైన నిల్వలు ఉన్నాయని చెప్పాడు. అయితే, ఇప్పుడు అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్, ట్రంప్ వాదనలకు విరుద్ధంగా ప్రకటన చేశారు. పాకిస్తాన్లో చమురు నిల్వలను అన్వేషించడంలో అమెరికాకు ఆసక్తి లేనది చెప్పాడు. Read Also: RBI Digital Payment Rules: యూజర్స్ కు అలర్ట్.. డిజిటల్ చెల్లింపులపై ఆర్బీఐ […]
Khalistani terrorist: కెనడాలో ఉంటూ, ఖలిస్తాన్ అంటూ గొడవ చేసే ఉగ్రవాదులు భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌కు ఖలిస్తానీ ఉగ్రవాది ఇందర్ జీత్ గోసల్ బెదిరింపులు జారీ చేశారు. అరెస్ట్ అయిన కొద్ది రోజులకే కెనడాలో బెయిల్ పొందిన ఇందర్ జీత్ ‘‘ దోవల్, నేను మీ కోసం ఎదురు చూస్తున్నాను’’ అని వార్నింగ్ ఇచ్చాడు.
ICC: ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్ ఫోన్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ పేసర్ హారిస్ రౌఫ్ రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, 6 భారత ఫైటర్ జెట్లను కూల్చేసిందనే అర్థం వచ్చేలా హావభావాలను ప్రదర్శించాడు. దీనిపై BCCI అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి ఫిర్యాదు చేసింది.
UP: ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ పోస్టర్‌పై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం బరేలీలో నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. సెప్టెంబర్ 4న ‘ఐ లవ్ ముహమ్మద్’ పోస్టర్‌తో ఉన్న టెంట్‌ను పోలీసులు తొలగించిన తర్వాత కాన్పూర్‌లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఒక మతపెద్ద మెమోరాండం సమర్పించాలని ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పందనగా శుక్రవారం ప్రార్థనల తర్వాత బరేలీలోని ఇస్లామియా మైదానం సమీపంలో భారీగా జనాలు గుమిగూడారు.
Tej Pratap Yadav: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీ రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ చీఫ్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. లాలూ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి అయిన తేజ్ ప్రతాప్ తన కొత్త పార్టీ ‘‘జనశక్తి జనతాదళ్’’ను ఆవిష్కరించారు. రానున్న బీహార్ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.