Armenia: ఆర్మేనియా, అజర్ బైజాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నడుస్తోంది. ఈ రెండు దేశాల మధ్య నగర్నో-కారాబఖ్ ప్రాంతం విదాస్పదంగా మారింది. ఈ ప్రాంతంలోని ఆర్మేనియన్లపై అజర్ బైజాన్ దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి తరలివెళ్తున్న ఆర్మేనియన్లు భారీ ప్రమాదం బారిన పడ్డారు. గ్యాస్ స్టేషన్ వద్ద భారీ ప్రమాదం సంభవించడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది గాయపడ్డారు.
నాగర్నో-కారాబఖ్ ప్రాంతంలోని ఆర్మేనియా సైనిక బలగాలపై అజర్ బైజాన్ సైన్యం దాడులు జరుపుతోంది. దీంతో పెద్ద ఎత్తున ఆ ప్రాంతం నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇలా వెళ్లే క్రమంలోనే ఓ గ్యాస్ స్టేషన్ వద్ద పేలుడు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు కార్లు పెద్ద ఎత్తున గ్యాస్ స్టేషన్లు, రోడ్లపై బారులు తీరాయి.
స్టెపనాకెర్ట్ నగరం వెలుపల ఉన్న గ్యాస్ స్టేషన్లో పేలుడు సంభవించింది. సోమవారం ఈ పేలుడు సంభవించింది. అజర్ బైజాన్ మిలిటరీ యాక్షన్ వల్ల ఈ ప్రాంతంలోని 13,500 మంది సరిహద్దును దాటి పారిపోయారని ఆర్మేనియా ప్రభుత్వం తెలిపింది. ఆర్మేనియాను నగర్నో కారాబఖ్ ను కలిపే ప్రధాన రహదారిని అజర్ బైజాన్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
ఆర్మేనియా-అజర్ బైజాన్ మధ్య నగర్నో-కారాబాఖ్ ప్రాంతం వివదాస్పదంగా ఉంది. ఈ రెండు దేశాలు ఈ ప్రాంతంపై పట్టుకోసం పోరాడుతున్నాయి. ముఖ్యంగా ఆర్మేనియాను ఓడించేందుకు టర్కీ, పాకిస్తాన్ వంటి దేశాలు అజర్ జైజాన్ కి మద్దతు తెలపడంతో పాటు సైనిక సాయం అందిస్తున్నాయి. మాజీ సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్న ఈ రెండు దేశాలు ప్రస్తుతం బద్ధ శతృవులుగా ఉన్నాయి.