S Jaishankar: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య అగ్గిరాజేసిన వేళ భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పరోక్షంగా కెనడాకు గడ్డి పెట్టారు. ఆ దేశాన్ని ఉద్దేశించేలా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సౌలభ్యం కోసం ఉగ్రవాదం, తీవ్రవాదం, హింసపై ప్రతిస్పందన ఉండకూడదని ఆయన అన్నారు.
Read Also: US presidential race: ట్రంప్ దూకుడు.. జో బైడెన్‌ను మించి ఆధిక్యం..
మంగళవారం యూఎన్ లో మాట్లాడిన ఆయన.. ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్య చేసుకోవద్దని హితవు పలికారు. కొన్ని దేశాలు ప్రపంచ ఎజెండాను నిర్దేశించేలా మునిగిపోయాయని అన్నారు. మా చర్చల్లో మేము నియమాలను పాటిస్తామని, యూఎన్ చార్టర్ పై గౌరవం ఉందని, అయితే కొన్ని దేశాలు మాత్రం వాటి ఎజెండాను రూపొందించడానికి ప్రయత్నిస్తాయని, ఇది ఎప్పుడు కొనసాగదని, దాన్నిసవాల్ చేయకుండా ఉండదని నొక్కి చెప్పారు.
మనం అందరం మనసులో అనుకుంటే న్యాయమైన, సమానమైన, ప్రజాస్వామ్య క్రమం తప్పకుండా వస్తుందని జైశంకర్ అన్నారు. అలీనోద్యమం నుంచి భారత్ ఇప్పుడు విశ్వ మిత్ర యుగానికి పరిణామం చెందిందని, భాగస్వాములతో సహకారాన్ని ప్రోత్సహించడానికి భారత్ ఎప్పుడూ ప్రయత్నిస్తుందని అన్నారు. బ్రిక్స్, జీ 20 సమావేశాలు, చంద్రయాన్-3, జీ 20 సదస్సు ఇలా పలు అంశాలపై జైశంకర్ మాట్లాడారు.
కెనడా-ఇండియా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత నడుస్తోంది. హర్దీప్ సింగ్ నిజ్జర్ వంటి ఉగ్రవాదిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అయితే దీనిపై కెనడా రాద్ధాంత చేస్తోంది. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించాడు. కెనడా భారత్ దౌత్యవేత్తను బహిష్కరిస్తే, భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని భారత విదేశాంగ శాఖ ధ్వజమెత్తింది.