Actor Vijay: టీవీకే అధినేత, స్టార్ యాక్టర్ విజయ్, నిన్న తమిళనాడు కరూర్‌లో నిర్వహించిన ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. తొక్కిసలాట జరిగి 40 మంది మరణించారు. 100 మంది వరకు గాయపడ్డారు. అయితే, ఈ ఘటన వెనక డీఎంకే కుట్ర ఉందని టీవీకే పార్టీ ఆరోపించింది. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని టీవీకే న్యాయవాది అరివాజగన్ తెలిపారు. కరూర్ ర్యాలీలో భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించామని ప్రభుత్వం ఆరోపించడాన్ని ఆయన తోసిపుచ్చారు.
Tamil nadu: తమిళ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. కరూర్‌లో ఈరోజు విజయ్ నిర్వహించిన ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది. మొత్తం 10 మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
USA: అమెరికా ఏదైనా యుద్ధానికి ప్లాన్ చేస్తోందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ వచ్చే వారం ఉత్తర వర్జీనాయాలోని ఒక సైనిక స్థావరంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జనరల్స్, అడ్మిరల్స్ సహా అనేక మంది రక్షణ అధికారులు ఒకే చోట సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వన్ స్టార్ లేదా అంతకన్నా ఎక్కువ సీనియర్ కమాండర్లు, వారి సీనియర్ సలహాదారులు వచ్చే మంగళవారం క్వాంటికోలోని మెరైన్ కార్ప్స్ స్థావరంలో ఒక ప్లాన్ గురించి […]
PoK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తు్న్నారు. పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా శనివారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. వీరిని అణిచివేసేందుకు పాక్ ఆర్మీ, పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Read Also: Pakistan: దాయాదికి అంత దమ్ము ఉందా? పాక్ బట్టలు విప్పిన జర్నలిస్ట్ పాకిస్తాన్ ఆర్మీ ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు […]
Netanyahu: ఇజ్రాయిల్ గాజాపై దాడి చేయడాన్ని పలు ముస్లిం, అరబ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రసంగ సమయంలో అరబ్ దేశాలు, ముస్లిం దేశాల ప్రతినిధులు సభను నుంచి వాకౌట్ చేశారు. కొన్ని దేశాలు మాత్రమే సభలో కూర్చుని నెతన్యాహూ ప్రసంగాన్ని విన్నాయి.
Muhammad Yunus: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. 2024లో బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్ల తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి, భారత్ పారిపోయి వచ్చింది. ఈ పరిణామాల తర్వాత యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నియమితులయ్యారు. అయితే, ఆయన నియామకం తర్వాత మైనారిటీలు , ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు.
Navratri Celebration: భారతదేశం మాత్రమే కాదు, పలు దేశాల్లోని హిందువులు ‘‘నవరాత్రి’’ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే, ఇప్పుడు నవరాత్రి వేడుకలకు సంబంధించిన రెండు వీడియోలు ఆన్లైన్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ రెండు కూడా భారతదేశానికి చెందిన వీడియోలు కాదు,
Sonam Wangchuk: బుధవారంలో లడఖ్‌కు రాష్ట్ర హోదా కోరుతూ హింసాత్మక అల్లర్లు జరిగాయి. ఈ ఆందోళనల్లో నలుగురు మరణించడంతో పాటు 50కి పైగా మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆందోళనకారులతో పాటు పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది ఉన్నారు. ఆందోళనకారులు బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టడంతో పాటు, భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. అయితే, ఈ హింసను ప్రేరేపించేలా చేశాడని లడఖ్ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్పై కేంద్ర ప్రభుత్వం కేసు పెట్టింది.
Natural gas: భారత్ జాక్‌పాట్ కొట్టింది. దేశంలో మొదటిసారిగా అండమాన్ సముద్రంలో ‘‘సహజ వాయువు’’ నిక్షేపాలను కనుగొంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ శ్రీ విజయపురం-2 బావి వద్ద గ్యాస్‌ను కనుగొంది. ప్రారంభ టెస్టుల్లో 87 శాతం మీథేన్ ఉన్నట్లు తేలింది. గతంలో ఈ ప్రాంతంతో సంభావ్య చమురు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థను, ఇంధన మార్కెట్‌ను గణనీయంగా మారస్తుంది.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం నడుస్తోంది. నిన్న బరేలీలో శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత, పెద్ద ఎత్తున గుంపు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థిని కంట్రోల్ చేశారు. ఈ వివాదం కాన్పూర్‌లో మొదలైంది. తర్వాత కౌశాంబి లాంటి పట్టణాలకు చేరింది.