Vande Bharat Trains: ఇండియన్ రైల్వే ప్రతిష్టాత్మకంగా సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టింది. దేశం మొత్తం ఇప్పుడు 68 వందేభారత్ రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ రైళ్లను 14 నిమిషాల్లోనే శుభ్రం చేయాలనే కొత్త విధానాన్ని రైల్వేశాఖ తీసుకురాబోతోంది. ‘
Communal Tension: రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలో మత ఉద్రిక్తతలు ఏర్పడింది. రామ్‌గంజ్ పరిసర ప్రాంతాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు మోటార్ సైకిళ్ల యాక్సిడెంట్ తరువాత ఒక గుంపు తీవ్రంగా కొట్టడం వల్ల ఒక వ్యక్తి మరణించాడు. ఈ ఘటన శనివారం నగరంలో ఉద్రిక్తతను పెంచింది. అయితే అవగాహన లోపంతో ఇది జరిగిందని సిటీ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ తెలిపారు.
Manipur Violence: గత నాలుగు నెలలుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. మెయిటీ, కుకీల మధ్య జాతి ఘర్షణల కారణంగా 175 మంది మరణించారు. చాలా మంది సొంత ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. పరిస్థితి శాంతియుతంగా మారుతుందనుకునే సమయంలోనే మళ్లీ అల్లర్లు మొదలువుతున్నాయి. ఇటీవల ఇద్దరు మెయిటీ విద్యార్థులను మిలిటెంట్లు చంపడం మరోసారి ఆ రాష్ట్రంలో విధ్వంసానికి కారణమైంది. ఏకంగా సీఎం బీరెన్ సింగ్ ఇంటిపైనే ఆందోళనకారులు దాడికి తెగబడ్డారు.
Aditya-L1: భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఆదిత్య ఎల్ 1 అనుకున్నట్లుగానే గమ్యం దిశగా పయణిస్తోంది. తాజాగా భూమి ప్రభావాన్ని తప్పించుకుని ముందుకు సాగుతున్నట్లుగా ఇస్రో వెల్లడించింది. ‘స్పియర్ ఆఫ్ ఎర్త్ ఇన్ఫూయెన్స్’ దాటినట్లుగా తెలిపారు.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేశారు. శనివారం మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘జన్ ఆక్రోశ్’ ర్యాలీలో పాల్గొన్నారు.
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఏడాది చివర్లలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతుండటంతో శనివారం ఆయన బిలాస్పూర్ లో నిర్వహించిన మహాసంకల్ప్ ర్యాలీలో పాల్గొన్నారు
Breaking News: రూ.2000 నోట్ల మార్పిడికి గడువు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. సెప్టెంబర్ 30తో నోట్ల మార్పిడికి తుది గడువు ముగిసింది. అయితే బ్యాంకుల్లో రూ. 2000 నోట్లను మార్పిడి చేసుకునే గడువును అక్టోబర్ 7 వరకు పొడగించింది.
Cyber Investment Fraud: నేరస్తులు పంథా మార్చారు. గతంలోలాగా ఇళ్లను కొల్లగొట్టడం కాకుండా కొత్తగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. గిప్టులు, లక్కీ డ్రా, ఓటీపీల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రూ.854 కోట్ల సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. బెంగళూర్ కేంద్రంగా సైబర్ ఇన్వెస్ట్మెంట్ మోసాన్ని పోలీసులు ఛేదించారు. పెట్టుబడి పెడితే రోజుకు రూ. 1000 నుంచి రూ. 5000 వరకు లాభం పొందొచ్చని చెబుతూ దేశంలో వేలాది మందిని మోసం చేశారు.
Rahul Gandhi: మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. గత దశాబ్ధకాలం నుంచి ఆ రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉంటోంది. అయితే ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి శాయశక్తుల ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరును మహాత్మా గాంధీ, గాడ్సేల మధ్య పోరుగా అభివర్ణించారు.
Ujjain Rape Case: ఉజ్జయిని అత్యాచార ఘటన దేశాన్ని షాక్‌కి గురిచేసింది. ఓ 12 ఏళ్ల బాలిక దారుణంగా అత్యాచారానికి గురై తీవ్రవేదనతో అర్దనగ్నంగా ప్రతీ ఇంటి ముందు వెళ్లి సాయం అడిగిన వీడియో యావత్ దేశాన్ని కుదిపేసింది. ఓ దిక్కు రక్తం కారుతున్నా,