Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో భారీ మాదకదవ్యాల కుట్ర భగ్నమైంది. నార్కో-టెర్రర్ కుట్రను పోలీసులు ఛేదించారు. రాంబన్ జిల్లాలో ఒక వాహనం నుంచి రూ. 300 కోట్ల విలువైన 30 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
IndiGo Plane Incident: గాలిలో విమానం, తీవ్రమైన గుండె జబ్బులో బాధపడుతున్న ఓ పసికందు, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. చావుబతుకుల సమస్య. కానీ అప్పుడే ఓ అద్భుతం జరిగింది. పసికందు ప్రయాణించే విమానంలోనే ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. వారే చిన్నారి ప్రాణాలను నిలబెట్టారు. ఇందులో ఒక డాక్టర్ ఐఏఎస్ ఆఫీసర్. చిన్నారి పరిస్థితిని తెలుసుకుని అత్యవసరంగా చికిత్స అందించారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే వింత ఆరోపణలు చేశారు. ప్రజలు తనపై చేతబడి ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. లఖింపూర్ ఖేరీ జిల్లా మెమహ్మదీ ఎమ్మెల్యే అయిన లోకేంద్ర ప్రతాప్ సింగ్ తన ఫేస్బుక్ పేజీలో ఈ ఫిర్యాదు చేశారు. తనను లక్ష్యంగా చేసుకుని చేతబడి చేస్తున్నారని, ఓ ఫోటోను పోస్ట్ చేశారు.
Chhatrapati Shivaji: ఛత్రపతి శివాజీ మహారాజ్ 1659లో వాడిని ఆయుధం పులి పంజా ఆకారంలో ఉండే ‘వాఘ్ నఖ్’ భారతదేశానికి రాబోతోంది. నవంబర్ నెలలో లండన్ నుంచి భారత్ కి ఈ ఆయధాన్ని తీసుకురానున్నారు. దీన్ని తీసుకువచ్చేందుకు మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ అవసరమైన ఒప్పందంపై మంగళవారం లండన్ లో సంతకాలు చేయనున్నారు.
Apple iPhone 15: యాపిల్ సంస్థ ఇటీవల ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను రిలీజ్ చేసింది. అయితే ఈ ఫోన్లు ఎక్కువగా వేడవుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. హీట్ కావడానికి కారణాలను గుర్తించామని, దీంతో పాటు ఐఓఎస్ 17 సాఫ్ట్ వేర్లోని బగ్ ని రాబోయే అప్డేట్ లో పరిష్కరించనున్నట్లు యాపిల్ తెలిపింది.
Pak Army Chief: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సు, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 65 మంది చనిపోయారు. శుక్రవారం జరిగిన ఈ దాడులతో పాకిస్తాన్ కలవరపడుతోంది. అయితే ఈ దాడిపై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్పందించారు. పాక్ నుంచి ఉగ్రవాద ముప్పును నిర్మూలిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. మస్తుంగ్ లోని మదీనా మసీదు సమీపంలో మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా జరిగిన ఊరేగింపు లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది.
S Jaishankar: భారత్-అమెరికా కలిసి పనిచేయడం చాలా అవసరమని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇరు దేశాల బంధంపై పరిమితి విధించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు దేశాలు ఒకరికొకరు కావాల్సిన, అనుకూలమైన, సౌకర్యవంతమైన భాగస్వాములుగా ఆయన అభివర్ణించారు. ఇటీవల యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు జైశంకర్ అమెరికా వెళ్లారు. దీంతో పాటు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, యూఎస్ జాతీయ భద్రతా సలహాదారుతో సమావేశమయ్యారు.
Suicide Bombing: టర్కీ రాజధాని అంకారా నడిబొడ్డున ఆత్మాహుతి దాడి జరిగింది. పార్లమెంట్ భవనం వెలుపల, మంత్రిత్వ శాఖ భవనాలకు ముందు ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మహుతి బాంబు దాడికి పాల్పడ్డారని టర్కీ అంతర్గత మంత్రి ఆదివారం చెప్పారు. వేసవి విరామం తర్వాత పార్లమెంట్ తిరిగి తెరవడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరిగింది.
Pakistan: పాకిస్తాన్లో అసలేం జరగుతోంది. ఎవరికీ అంతుచిక్కకుండా గుర్తు తెలియని వ్యక్తులు భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని లేపేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులు ఇలాగే చంపివేయబడ్డారు. తాజాగా మరో ఉగ్రవాదిని లేపేశారు. లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకరైన ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్ని కరాచీ నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
UK: ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. యూకేలో భారత రాయబారిగా ఉన్న విక్రమ్ దొరైస్వామిని గ్లాస్గో గురుద్వాలోకి వెళ్లకుండా ఖలిస్తానీ వేర్పాటువాదులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై భారతదేశం, యూకేకి తన ఆందోళన తెలియజేసింది.