Ujjain Rape Case: “నా కొడుకును ఉరేసి చంపండి”.. ఉజ్జయిని రేప్ కేసు నిందితుడి తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ujjain Rape Case: ఉజ్జయిని అత్యాచార ఘటన దేశాన్ని షాక్‌కి గురిచేసింది. ఓ 12 ఏళ్ల బాలిక దారుణంగా అత్యాచారానికి గురై తీవ్రవేదనతో అర్దనగ్నంగా ప్రతీ ఇంటి ముందు వెళ్లి సాయం అడిగిన వీడియో యావత్ దేశాన్ని కుదిపేసింది. ఓ దిక్కు రక్తం కారుతున్నా, 8 కిలోమీటర్లు నడిచి సాయం కోరితే, కొందరు ఇంటి ముందు నుంచి తరిమికొట్టడం అక్కడ సీసీటీవీల్లో రికార్డైంది. చివరకు ఓ గుడి పూజారి బాలికను పరిస్థితిని గుర్తించి కొత్త బట్టలు ఇచ్చి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సర్కార్ సిట్ ని ఏర్పాటు చేసింది. ఘటన జరిగిన వెంటనే ప్రధాన నిందితుడైన ఆటోడ్రైవర్ భరత్ సోనిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ‘‘నా కొడుకును ఉరేసి చంపండి’’ అని నిందితుడు భరత్ సోని తండ్రి డిమాండ్ చేశారు. బాధిత బాలిక కూడా తన కూతురు లాంటిదే అని ఆయన అన్నారు. ఈ కేసులో నిందితుడి పక్షాలన ఎవరూ వాదించవద్దని స్థానిక బార్ అసోసియేషన్ కోరింది.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
Read Also: Jaishankar: మేమేం తలుపులు మూసుకుని కూర్చోలేదు.. ఆధారాలుంటే ఇవ్వండి.. కెనడాకు స్ట్రాంగ్ మెసేజ్..
ఇది సిగ్గుమాలిన చర్యల, నేను నా కొడుకును కలిసేందుకు ఆస్పత్రికి వెళ్లలేదు, పోలీస్ స్టేషన్, కోర్టుకు కూడా వెళ్లను, నా కొడుకు నేరం చేశాడు కాబట్టి అతన్ని ఉరితీయాలి అని నిందితుడి తండ్రి అన్నారు. ఈ ఘటన పవిత్ర ఉజ్జయిని ప్రాంత ప్రతిష్టను దెబ్బతీసిందని బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అశోక్ యాదవ్ అన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడి భరత్ సోనితో పాటు మరో ఇద్దర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు పట్టుకున్నారు. బాధిత బాలిక ప్రస్తుతం ఇండోర్ లోని ప్రభుత్వ మహారాజా తుకోజీరావు హోల్కర్ మహిళా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రధాని మోడీ, హోమంత్రి అమిత్ షా మౌనంగా ఉన్నారని, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, మహిళలు కావడం పాపంగా మారిందని, మైనర్ల అత్యాచార కేసుల్లో మధ్యప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని, 18 ఏళ్ల పాలనలో 58 వేల రేప్ కేసులు నమోదయ్యాయని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది.
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!