Rahul Gandhi: ఒకవైపు మహాత్మా గాంధీ, మరో వైపు గాడ్సే..ఎంపీ ప్రచారంలో రాహుల్ గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. గత దశాబ్ధకాలం నుంచి ఆ రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉంటోంది. అయితే ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి శాయశక్తుల ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరును మహాత్మా గాంధీ, గాడ్సేల మధ్య పోరుగా అభివర్ణించారు.
రాహుల్ గాంధీ బీజేపీ పార్టీని మహత్మా గాంధీ హంతకుడు నాథురామ్ గాడ్సేతో పోల్చారు. ఎంపీలోని షాజాపూర్ లో జరిగిన ‘జన్ ఆక్రోశ్’ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరాటమని, ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ఉంలటే మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నాయని, ఒక వైపు మహాత్మా గాంధీ ఉంటే మరో వైపు గాడ్సే ఉన్నారని ఆయన అన్నారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
Read Also: Rk Roja: సీఎం జగన్ ను విమర్శిస్తే.. మర్యాద దక్కదు బ్రాహ్మణి..?
కాంగ్రెస్ సోదరభావం పెంచితే, బీజేపీ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎక్కడికెళ్లినా ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందని, మధ్యప్రదేశ్ యువత, రైతులు వారిని బీజేపీని అసహ్యించుకుంటున్నారని, ప్రజలకు వారు ఏం చేశారు, ప్రజల నుంచి వారు అదే పొందుతారు అని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర చేస్తున్న సమయంలో మధ్యప్రదేశ్ కి చెందిన రైతులు తనను కలిశారని, వారు నాతో చాలా చెప్పారని, ఈ రాష్ట్రంలో బీజేపీ చేసిన అవినీతి దేశంలో ఎక్కడా జరగలేదని రాహుల్ ఆరోపించారు. రైతులు పండించిన పంటకు సరైన ధర లభించట్లేదని, ఛత్తీస్‌గఢ్ లో బియ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2500 ఇస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తామని అన్నారు.
ఈ ఏడాది చివరలో మధ్యప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల ముందు వస్తున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కీలకం కానున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇరు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!