Nobel Prize: ప్రపంచంలో అత్యున్నత బహుమతైన ‘నోబెల్ ఫ్రైజ్’ ప్రకటన ప్రారంభమైంది. వైద్యశాస్త్రంలో అత్యున్నత కృషి చేసింనదుగానూ కాటాలిన్ కారిడో, డ్రూ వీస్మాన్లను నోబెల్ బహుమతిని సోమవారం ప్రకటించారు. మానవాళికి పెనుముప్పుగా మారిని కోవిడ్19ని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్‌పై ఇరువురు పరిశోధనలు జరిపారు. వ్యాక్సిన్ తయారీకి మార్గాన్ని సుగమం చేసిన మెసెంజర్ ఆర్ఎన్ఏ(ఎంఆర్ఎన్ఏ) సాంకేతికతపై ఇరువురు పరిశోధలు చేశారు.
PM Modi: కాంగ్రెస్ పార్టీ, అశోక్ గెహ్లాట్ లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఉదయ్‌పూర్‌లో దారుణంగా మతోన్మాదులు చేతిలో హత్యకు గురైన కన్హయ్య లాల్ అంశాన్ని మోడీ ప్రస్తావించారు.
Kerala: గూగుల్ మ్యాప్స్, జీపీఎస్‌ని నమ్మిపోతే ఇద్దరు యువ డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. కారు నదిలో మునిగిపోయి ప్రమాదం జరిగింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. కొల్లాంకు చెందిన డాక్టర్ అద్వైత్(29), త్రిసూర్కి చెందిన డాక్టర్ అజ్మల్(29) జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రిలో విధులు ముగించుకుని కొడుంగల్లూరు నుంచి ఇళ్లకు బయలుదేరారు. వీరితో పాటు మరో ముగ్గరు డాక్టర్లు తబ్సిర్, తమన్నా, నర్స్ జిస్మాన్ కూడా ఉన్నారు.
WhatsApp: మెసేజింగ్ ఫ్లాట్‌ఫారమ్ వాట్సాప్ ఇండియాలో ఆగస్టు నెలలో 74.2 లక్షల అకౌంట్లపై బ్యాన్ విధించింది. 2021 కొత్త ఐటీ రూల్స్ ఆధారంగా వాట్సాప్ ఈ ఖాతాను నిషేధించింది. వీటిలో వినియోగదారుల నుంచి ఎలాంటి రిపోర్టు రాకముందే 35 లక్షల ఖాతాలను బ్యాన్ చేశారు.
Covid-19: కోవిడ్ 19 గత మూడేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. వ్యాక్సినేషన్ డెవలప్ చేసినా కూడా రూపాలు మార్చుకుంటూ కొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే కోవిడ్ 19 దీర్ఘకాలంలో పలు సమస్యలకు కారణమవుతోంది. మెదడు, జట్టు రాలడం, అంగస్తంభన వంటి అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాణాంతక ప్రియాన్ వ్యాధికి కూడా కారణం అవుతోందని, కోవిడ్ 19తో సంబంధం ఉందనే అనుమానం కలుగుతోంది.
Birthday Party: బర్త్ డే వేడులకు చాలా గ్రాండ్‌గా జరపాలని తల్లిదండ్రులు భావిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద తప్పులకు దారి తీస్తుంటాయి. క్యాండిల్స్, ఫోమ్ కారణంగా కొన్నిసార్లు అగ్ని ప్రమాదాలు సంభవించిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా బెంగళూర్ లో ఓ బర్త్ డే వేడుకల్లో తృటిలో ప్రాణాపాయం తప్పింది. బెలూన్లు పేలి నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి.
Electric Car Catches Fire: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లను విరివిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే గతంలో కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలిపోవడం, బ్యాటరీలు పేలిపోవడం చూశాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది కూడా మరణించారు. అయితే ఆ తరువాత మరింత పకడ్బందీగా కంపెనీలు ఈవీల భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అయితే స్కూటర్ల విషయాన్ని పక్కన పెడితే, కార్లలో మాత్రం మంటలు చెలరేగడం చాలా అరుదుగా చూశాం.
Hyundai: కొరియన్ కార్ మేకర్ హ్యుందాయ్ రికార్డ్ సేల్స్‌తో దూసుకుపోతోంది. కంపెనీ ప్రారంభమైన తర్వాత ఈ సెప్టెంబర్ లోనే రికార్డు అమ్మకాలు జరిపింది. ముఖ్యంగా ఎస్యూవీ విభాగంలో కార్ల అమ్మకాల్లో పెరుగుదల ఓవరాల్‌గా హ్యుందాయ్ కంపెనీకి ప్లస్ అయ్యాయి. ప్రస్తుతం హ్యుందాయ్ కంపెనీ నుంచి ఎస్యూవీ పోర్టుఫోలియోలో ఎక్స్టర్, వెన్యూ, క్రేటా, అల్కజర్, టక్సన్ కార్ మోడల్స్ ఉన్నాయి.
JNU: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఈ యూనివర్సిటీ కేంద్రంగా నిలిచిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణకు కేంద్ర బింధువుగా ఉంది.
Manipur: మే నెలలో మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ అల్లర్లలో జూలై నెలలో అదృశ్యమైన ఇద్దరు మైయిటీ తెగకు చెందిన విద్యార్థులు దారుణంగా హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మరోసారి మణిపూర్ అగ్నిగుండంగా మారింది. ఏకంగా సీఎం బిరేన్ సింగ్ ఇంటిపైనే దాడి జరిగింది. బాధిత వర్గం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.