Rahul Gandhi: కాంగ్రెస్ అధినే రాహుల్ గాంధీ, తన తల్లికి సర్ఫ్రైజ్ గిఫ్టు ఇచ్చారు. ఒక కొత్త వ్యక్తిని తన కుటుంబంలో పరిచయం చేశారు. సోనియా గాంధీకి ఒక పెంపుడు కుక్కను గిఫ్టుగా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించారు.
Bombay High: మహారాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వరసగా రోగుల మరణాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నాందేడ్, ఛత్రపతి శంభాజీనగర్, నాగ్‌పూర్ ఈ రెండు ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో 50 మందికి పైగా రోగులు మరణించారు. నాందేడ్‌లోని శంకర్రావ్ చవాన్ ఆస్పత్రిల్లో గడిచిన 72 గంటల్లో 16 మంది పిల్లలతో సహా మొత్తం 31 మంది మరణించారు. ఇక శంభాజీనగర్(ఔరంగాబాద్) ఆస్పత్రిలో 18 మరనణాలు సంభవించాయి.
Mercury: సౌరకుటుంబంలో బుధ గ్రహానికి ఓ ప్రత్యేక ఉంది. సూర్యుడికి అతిదగ్గరగా ఉన్న, అతిచిన్న గ్రహాం. అయితే బుధుడి గురించి తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బుధ గ్రహం క్రమక్రమంగా కుచించుకుపోతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు
Meta Layoff: ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో టెక్ పరిశ్రమల్లో ఉద్యోగాలు ఊస్ట్ అవుతున్నాయి. 10, 20 ఏళ్లు పనిచేసిన సీనియర్ ఉద్యోగులపై కూడా కనికరం చూపించకుండా టెక్ కంపెనీలు పీకిపారేస్తున్నాయి. ఆదాయం తగ్గడంతో, ఖర్చులను అదుపుచేసే ఉద్దేశంతో కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలైన అమెజాన్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వేలల్లో తమ ఉద్యోగుల్ని తీసేశాయి.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బుధవారం కుల్గామ్ లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. జిల్లాలోని కుజ్జర్ ప్రాంతంలో ఎన్కౌంటర్ ప్రారంభమైందని కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే మరోవైపు రాజౌరీ జిల్లాలో గత మూడు రోజులుగా ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది.
Pakistan: ఆర్థిక, రాజకీయ అస్థిరత రాజ్యమేలుతున్న పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాద దాడులు పెరిగాయి. ఇటీవల బలూచిస్తాన్ ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 57 మంది మరణించారు. ఇదిలా ఉంటే ఈ దాడులకు ఆఫ్ఘాన్ జాతీయులు కారణం కావచ్చని పాకిస్తాన్ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న ఆఫ్ఘన్ పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 1లోగా తమ దేశంలో ఉన్న 17 లక్షల మంది ఆఫ్ఘాన్లు పాకిస్తాస్ వదిలి వెళ్లాలని హుకూం జారీ చేసింది.
Maharashtra: మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరణమృదంగం మోగుతూనే ఉంది. పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు పిల్లల్లా రాలిపోతున్నారు. నాందేడ్ ఆస్పత్రి ఘటన జరిగి ఒక రోజు గడవక ముందే మరో రెండు ఆస్పత్రుల్లో పేషెంట్లు చనిపోయారు.
NewsClick: చైనా అనుకూల ప్రచారం చేస్తూ, చైనా నుంచి డబ్బులు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో న్యూస్‌క్లిక్ మీడియా పోర్టల్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ ప్రబీర్ పురకాయస్థను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన తోపాటు
World Cup 2023: భారతదేశం ప్రతిష్టాత్మకంగా ఐసీసీ ప్రపంచకప్ మ్యాచుల్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే విదేశీ జట్లు భారత చేరుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచును టార్గెట్ చేస్తూ ఖలిస్తానీ వేర్పాటువాదులు రభస చేయాలని చూస్తున్నారు.
India-Canada: భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదం మరింత ముదురుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో కాల్చి చంపారు. అయితే ఇటీవల ఈ హత్యతో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించడంతో వివాదం పెద్దదైంది. దీంతో పాటు కెనడా, భారత సీనియర్ దౌత్యవేత్తను ఆ దేశం నుంచి బహిష్కరించింది. భారత్ ఇందుకు ప్రతిగా కెనడియన్ దౌత్యవేత్తను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది.