Mercury: సౌరకుటుంబంలో బుధ గ్రహానికి ఓ ప్రత్యేక ఉంది. సూర్యుడికి అతిదగ్గరగా ఉన్న, అతిచిన్న గ్రహాం. అయితే బుధుడి గురించి తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బుధ గ్రహం క్రమక్రమంగా కుచించుకుపోతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. బిలియన్ సంవత్సరాలుగా బుధుడి సైజు తగ్గిపోతున్నట్లుగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటికే ఆ గ్రహ వ్యాసార్థం 7 కిలోమీటర్లు తగ్గినట్లుగా తేలింది. అయితే గ్రహం ఎందుకు కుచించుకుపోతుందనే విషయం స్పష్టంగా అంతుబట్టడం లేదని నేచర్ జియోసైన్స్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం నివేదించింది.
Read Also: Meta Layoff: మరో విడత ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమవుతున్న మెటా..
అమెరికాకు చెందిన ఓపెన్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి, రచయిత అయిన బెంజమిన్ మాన్ నాసాకు చెందిన మెసెంజర్ మిషన్(2011-15) నుంచి డేటా సేకరించి బుధుడిపై ఈ విషయాలను వెల్లడించారు. బుధుడి టెక్టోనిజం యాక్టవిటీ క్రియాశీలకంగా ఉండటమే కాకుండా.. ఇటీవల గ్రహ ఉపరితలం అంతటా విస్తృతంగా వ్యాపించిందని, దీంతో చాలా ప్రాంతాల్లో ముడతలు ఏర్పడినట్లు తెలిసింది.
బుధ గ్రహం సంకోచానికి గురవుతోందని, లోపలి భాగంలో థర్మోకెమికల్ లక్షణాల గురించి ప్రశ్నను లేవనెత్తుతోందని బెంజమిన్ చెప్పారు. ఇతర గ్రహాల మాదిరిగానే బుధుడిలోని అంతర్గత భాగం క్రమంగా వేడిని కోల్పోతోందని, అంతర్గత రాతి పలకలు, కరిగిన లోహాలు కుచించుకుపోతున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. దీని కారణంగానే ముడతలు ఏర్పడుతున్నాయని తెలిపారు.