Monsoon: అనుకున్నట్లుగానే ఎల్ నినో రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపించింది. రుతుపవన వర్షపాతం 2023లో ఐదేళ్ల కనిష్టానికి చేరుకుంది. 2018 నుంచి పరిశీలిస్తే ఈ ఏడాదే తక్కువ వర్షపాత నమోదైంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. 3 ట్రిలియన్ డాలర్ల ఉన్న ఆర్థిక వ్యవస్థకు రుతుపవనాలు చాలా కీలకం. పంటలకు నీరందించడానికి, జలశయాలను నింపడానికి అవసరమైన 70 శాతం వర్షాన్ని రుతుపవనాలే అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కవు నీటి సరఫరా వ్యవస్థ లేకపోవడంతో వ్యవసాయానికి రుతుపవనాలే చాలా కీలకం.
Maharashtra: మహారాష్ట్రలో ఘోరం జరిగింది. నాందేడ్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల్లోనే 24 మంది మరణించారు. ఇందులో 12 మంది నవజాత శిశువులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వివిధ ఆరోగ్య సమస్యలతో పాటు ఎక్కువగా పాము కాట్ల వల్ల మరణించినట్లు నాందేడ్ శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ ఆస్పత్రి డీన్ తెలిపారు.
PM Modi: దేశంలో తొలిసారిగా బీహార్ రాష్ట్రం కులగణన చేపట్టింది. దానికి సంబంధించిన వివరాలను ఈ రోజు ప్రకటించింది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ ఎన్నికల్ ప్రచారంలో పాల్గొంటున్న ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు కులం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం ధ్వజమెత్తారు.
Earthquake: వచ్చే 48 గంటల్లో పాకిస్తాన్ లో భారీ భూకంపం సంభవించవచ్చని డచ్ శాస్త్రవేత్త హెచ్చరించారు. నెదర్లాండ్స్‌కి చెందిన సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే (SSGEOS) పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భూకంపం వస్తుందని అంచనా వేసింది. డచ్ పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్బీట్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. అక్టోబర్ 1-3 మధ్య ఎప్పుడైనా భూకంపం రావచ్చని తెలిపారు. ప్రపంచంలో వచ్చే మేజర్ భూకంపాలను అంచనా వేయడంలో ఫ్రాంక్ దిట్ట.
Earthquake: ఈశాన్య రాష్ట్రాలను భూకంపం కుదిపేసింది. మేఘాలయ రాష్ట్రంలో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. సాయంత్రం 6.15 గంటలకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రెసుబెల్పరా జిల్లా కేంద్రం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్త్ గారో హిల్స్ లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.
Rahul Gandhi: దేశంలో తొలిసారిగా బీహార్ రాష్ట్రం కులాల వారీగా సర్వే చేసింది. కుల గణన ఫలితాలను ఈ రోజు వెల్లడించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం చేసిన ఈ పనిని కాంగ్రెస్ స్వాగతించింది. సామాజిక న్యాయం చేయడానికి, సామాజిక సాధికారత కోసం జాతీయ స్థాయిలో ఇలాంటి కసరత్తు చేయాలని కేంద్రాన్ని కోరింది.
Pakistan: విదేశాల్లో ఉంటున్న పాకిస్తానీయుల్లో 90 శాతం బిచ్చగాళ్లే అని ఇటీవల తేలింది. సౌదీ, ఇరాక్, యూఏఈతో పాటు ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలు, యూరప్ దేశాలకు వెళ్తున్న పాకిస్తానీయులు భిక్షాటన చేస్తున్నారు. ఇప్పటికే ఆయా దేశాల రాయబారులు ఈ విషయంలో పాకిస్తాన్‌కి ఫిర్యాదు చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ధరలు పాకిస్తాన్ ప్రజల్ని బిచ్చగాళ్లుగా మారుస్తున్నాయి.
ISIS: ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. మోస్ట్ వాంటెండ్ అనుమానిత ఐసిస్ ఉగ్రవాది షానవాజ్‌ని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోమవారం తెలిపింది. తెల్లవారుజామున జైత్పూర్ లో షానవాజ్‌ని అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై ఎన్ఐఏ నగదును ప్రకటించింది. ఇద్దరిని మహ్మద్ రిజ్వాన్ అష్రాఫ్, మహ్మద్ అర్షద్ వార్సిగా గుర్తించారు. అష్రాఫ్ ని లక్నోలో అరెస్ట్ చేయగా.. అర్షద్ ని మొరాదాబాద్ లో పట్టుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.…
Vande Bharat Express: భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సెమీ హైస్పీడ్ రైళ్లు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను తీసుకువచ్చింది. ఇప్పటికే 60 పైగా వందేభారత్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య తిరుగుతున్నాయి. రానున్న కాలంలో వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా ట్రాక్ ఎక్కనున్నాయి. ఇదిలా ఉంటే కొందరు మాత్రం ఈ రైళ్లు టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. రైళ్లపై రాళ్లతో దాడి చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా నమోదయ్యాయి.
Harpal randhawa: ఆఫ్రికా దేశం జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదంలో భారత మైనింగ్ వ్యాపారవేత్త మరణించారు. అతనితో పాటు ఆయన కుమారుడితో సహా ఆరుగురు మృతి చెందారు. బంగారం, బొగ్గు, నికెల్, రాగిని శుధ్ది చేసే డైవర్సిఫైడ్ మైనింగ్ కంపెనీ అయిన రియోజిమ్ ఓనర్ హర్పాల్ రంధావా ఈ ప్రమాదంలో మరణించారు. నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం కూలిపోయింది.