Titan Tragedy: టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు వెళ్లిన ‘టైటాన్’ సబ్మెర్సిబుల్ ఈ ఏడాది జూన్‌లో ప్రమాదానికి గురైంది. అట్లాంటిక్ సముద్రంలో దాదాపుగా 4 కిలోమీటర్ల అడుగులో ఒక్కసారిగా ఇన్ప్లోజన్ అనే పేలుడుకు గురైంది. ఈ ప్రమాదంలో అందులో ప్రమాణిస్తున్న ఐదుగురు మరణించారు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో టైటానిక్ షిప్ ఇదే ప్రాంతంలో ప్రమాదానికి గురై వందలమంది ప్రయాణికులు మరణానికి కారణమైంది. దానిని చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్మెర్సిబుల్ కూడా ప్రమాదానికి గురవ్వడం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని కలిగింది.
Madras High Court: తమిళనాడుకు చెందిన ప్రముఖ యూట్యూబర్, బైక్ రేసర్ టీటీఎఫ్ వాసన్కి బెయిల్ ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, యువతను ప్రేరేపిస్తున్న అతనిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూట్యూబ్ ఛానెల్ ని వెంటనే మూసేయాలని ఆదేశించింది. వాసన్కి 45 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బైక్ స్టంట్లు, రోడ్ ట్రిప్పులు చేస్తూ యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేస్తుంటాడు.
PM Modi: కాంగ్రెస్ టార్గెట్‌గా మరోసారి ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మోడీ పర్యటించారు. ‘పేపర్ లీక్ మాఫియా’ రాజస్థాన్ లోని లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జోధ్‌పూర్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన ప్రతీ అవినీతి తమ వద్ద ఉందని, దానిని బయటకు తీసుకురావాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని మోడీ అన్నారు.
Bombay High Court: రూ.100 లంచం తీసుకున్న అధికారి కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి కోర్టు ఉపశమనం ఇచ్చింది. ఈ కేసును విచారించిన హైకోర్టు..2007లో రూ.100 లంచంగా తీసుకోవడం చాలా చిన్న అంశమని, లంచం కేసులో ప్రభుత్వ వైద్య అధికారిని నిర్దోషిగా విడుదల చేస్తూ తీర్పు చెప్పింది.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోడీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆయన "చాలా తెలివైన వ్యక్తి" అని, మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెంతుతోందని ఆయన పొగిడారు. ఆర్థిక భద్రత, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాటంలో రష్యా, భారత్ మధ్య మరింత సహకారం ఉంటుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Sikkim Flash Flood: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో మెరుపు వరదలు విషాదాన్ని మిగిల్చాయి. రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటి వరకు 10 మంది మరణించగా.. 82 మంది గల్లంతయ్యారు. మొత్తం 14 వంతెనలు దెబ్బతిన్నాయని, 3000 మంది పర్యాటకులు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వరదల కారణంగా 23 మంది ఆర్మీ సిబ్బంది కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు ఒకర్ని సురక్షితంగా రక్షించగా.. మిగిలిన 22 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు కీలక ఆప్ నేతలు జైళ్లలో ఉన్నారు. సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియాల తర్వాత ఇప్పుడు సంజయ్ సింగ్ జైలులోకి వెళ్లారు.
Luna-25: చంద్రయాన్-3, అంతరిక్ష రంగంలో భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడించింది. ఎవరికి సాధ్యం కాని చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్‌ని విజయవంతంగా దించింది. చంద్రుడిపై ఇలా ల్యాండర్, రోవర్లని దించిన నాలుగో దేశంగా, దక్షిణ ధృవంపై దిగిన మొదటి దేశంగా కీర్తిగడించింది. అంతకుముందు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడిపై ల్యాండర్లను దించాయి.
Haryana: ప్రస్తుత కాలంలో ప్రతీ చిన్న సమస్యకు ఆత్మహత్యనే పరిష్కారం అనుకుంటున్నారు. నేటి తరం చిన్న కష్టాన్ని కూడా తట్టుకోవడం లేదు. యువత కష్టాలతో ధైర్యంగా పోరాడలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే మైనర్లు కూడా ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపరుస్తోంది. చిన్న చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు.
Sharad Pawar: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బీజేపీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తుపై మాట్లాడుతూ.. బీజేపీతో వెళ్లే ప్రశ్నే లేదని కుండబద్ధలు కొట్టారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే శరద్ పవార్ పార్టీ ఎన్సీపీలో చీలిక వచ్చింది. అజిత్ పవార్ వర్గం బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేనతో చేతులు కలిపి మహారాష్ట్రలో అధికారంలో ఉంది.