Meta Layoff: ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో టెక్ పరిశ్రమల్లో ఉద్యోగాలు ఊస్ట్ అవుతున్నాయి. 10, 20 ఏళ్లు పనిచేసిన సీనియర్ ఉద్యోగులపై కూడా కనికరం చూపించకుండా టెక్ కంపెనీలు పీకిపారేస్తున్నాయి. ఆదాయం తగ్గడంతో, ఖర్చులను అదుపుచేసే ఉద్దేశంతో కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలైన అమెజాన్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వేలల్లో తమ ఉద్యోగుల్ని తీసేశాయి.
Read Also: World Cup 2023: వన్డే ప్రపంచకప్ ప్రారంభోత్సవ వేడుకలు లేనట్టేనా.. కారణమేంటీ?
ఇదిలా ఉంటే తాజాగా ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటా మరో విడత ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతోంది. ఫేస్‌బుక్ ఎజైల్ సిలికాన్ టీమ్ లేదా ఫాస్ట్ అని పిలువబడే సిలికాన్ యూనిట్ లో తన వర్క్ ఫోర్సును తగ్గించుకోవాలని చూస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కంపెనీ అంతర్గత చర్చల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఎఫెక్ట్ అవుతున్న ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఎంత మంది ఉద్యోగుల్ని తీసేస్తుందనే వివరాలను మెటా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సారి 600 మంది ఉద్యోగుల్ని తీసేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్ నుంచి మెటా పలు విడుతలుగా ఉద్యోగుల్ని తీసేస్తూ వస్తోంది. ఇప్పటి వరకు 21,000 మందిని తొలగించింది. ఇక గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 12000 మంది ఉద్యోగులను ప్రపంచవ్యాప్తంగా తొలగించింది. అమెజాన్ 18,000 మందిని, మైక్రోసాఫ్ట్ 10,000 మందిని, ట్విట్టర్ తన ఉద్యోగుల్లో 50 శాతం మందిని తొలగించాయి.