World Cup 2023: ఐసీసీ వరల్డ్ కప్-2023 క్రికెట్ సమరం మొదలైంది. ఈ రోజు మొదలైన క్రికెట్ సమరం ప్రేక్షకులకు మంచి మజా ఇచ్చింది. ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలిపోరులో న్యూజిలాండ్ బోణీ కొట్టింది. 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ని మట్టికరిపించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒకే వికెట్ కోల్పోయి కివీస్ జట్టు ఛేదించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచులోల కివీస్ ఆటగాళ్లు కాన్వే, రచిన్ రవీంద్ర సెంచరీలతో చెలరేగారు.
Navi Mumbai: మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరుగుతున్నాయి. నిర్భయ, పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కామాంధులు బరి తెగిస్తూనే ఉన్నారు. వావీవరసలు మరిచి మృగాలుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కేసులు దేశంలో ఎక్కడో చోట బయటపడుతూనే ఉన్నాయి. పరువు కోసం బయటకు రాని కేసులు అనేకం ఉంటున్నాయి.
Tara Shahdeo: జాతీయ స్థాయి షూటర్ తారా సహదేవ్ ‘లవ్ జిహాద్’ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బలవంతపు మతమార్పిడి, ముస్లిం వ్యక్తి అయి ఉండీ హిందువుగా నటించి తారా సహదేవ్ ని పెళ్లాలడం, ఆ తరువాత బలవంతంగా మతం మారాలని ఒత్తిడి చేసిన కేసులో కీలక తీర్పును వెల్లడించింది.
Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడికి తెగబడింది. ఖార్కివ్ తూర్పు ప్రాంతంలోని సూపర్ మార్కెట్‌పై దాడి చేసింది. ఈ దాడిలో ప్రజలు పెద్ద ఎత్తున మరణించినతట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యా జరిపిన ఈ రాకెట్ దాడిలో ఇప్పటి వరకు 49 మంది ప్రజలు మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్ స్కీ తెలిపారు.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన ఎంపీ సంజయ్ సింగ్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా ఈ రోజు ఆయనకు కోర్టు అక్టోబర్ 10 వరకు 5 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో అంతకుముందు ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌తో పాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరు జైలులో ఉన్నారు. బుధవారం రోజు ఎంపీ సంజయ్ సింగ్ ఇంటిలో 10 గంటల పాటు ఈడీ…
India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై భారత్-కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం చెలరేగుతూనే ఉంది. ఇటీవల భారత్‌లోని కెనడా దౌత్యవేత్తలు 41 మందిని స్వదేశానికి రప్పించుకోవాలని ఆ దేశాని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అక్టోబర్ 10లోగా వారంతా వెళ్లాలని, ఆ తరువాత దేశంలో ఉంటే దౌత్యవేత్తలకు ఇస్తున్న ప్రత్యేక సదుపాయాలను కట్ చేస్తామని చెప్పింది.
Russia-Ukraine War: 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు కూడా వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేవు. బలమైన రష్యా ముందు ఉక్రెయిన్ కేవలం కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందని అంతా అనుకున్నా.. వెస్ట్రన్ దేశాల ఆర్థిక, సైనిక, ఆయుధ సహాయంతో రష్యాకు ఉక్రెయిన్ ఎదురొడ్డి నిలుస్తోంది. మరోవైపు రష్యా దాడులతో ఉక్రెయిన్ సర్వనాశనం అవుతోంది.
The Vaccine War: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీ మేకర్స్ నుంచి వచ్చి మరో సినిమా ‘ది వాక్సిన్ వార్’. కోవిడ్ సమయంలో భారత శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ రూపొందించిన కథాంశంతో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను తీశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో శాస్రవేత్తలు ఎదుర్కొన్న సవాళ్లు, వారి కృషిని ఆధారంగా ఈ సినిమాను తీశారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
Kenya: ఆఫ్రికా దేశం కెన్యాను మాయదారి రోగం కలవరపెడుతోంది. అసలు ఏ వ్యాధి కారణంగా బాలికలు అనారోగ్యానికి గురవుతున్నారో వైద్యులకు స్పష్టంగా తెలియడం లేదు. కెన్యాలోని దాదాపుగా 100 మంది పాఠశాల బాలికలు ఆస్పత్రిలో చేరారు. అధికారులు వారి రక్తం, మూత్రం, మలం నమూనాలను నైరోబిలోని ప్రయోగశాలకు పంపారు.
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ప్రైప్ ప్రకటించారు. నార్వేకు చెందిన రచయిత జోన్ ఫోస్సేకు 2023కి గానూ సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. దాదాపుగా 40 ఏళ్లుగా జోన్ ఫోస్సే నవలలు, నాటకాలు, కవితలు, కథలు, వ్యాసాలు, పిల్లల పుస్తకాలు రాస్తున్నారు. అతను రచించిన రచనలు యాభైకి పైగా భాషల్లోకి అనువదించబడ్డాయి. నాటకాలు ప్రపంచవ్యాప్తంగా వెయ్యిసార్లు ప్రదర్శించబడ్డాయి