PM Modi: కాంగ్రెస్ ప్రజల కన్నా తన ఓటు బ్యాంకునే ఎక్కువగా ప్రేమిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్ టార్గెట్‌గా మరోసారి ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మోడీ పర్యటించారు. ‘పేపర్ లీక్ మాఫియా’ రాజస్థాన్ లోని లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జోధ్‌పూర్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన ప్రతీ అవినీతి తమ వద్ద ఉందని, దానిని బయటకు తీసుకురావాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని మోడీ అన్నారు.
రాజస్థాన్ క్యాబినెట్ నుంచి తొలిగించబడిని మంత్రి రాజేంద్ర గుడా గతంలో ముఖ్యమంత్రి ఆర్థిక లావాదేవీలు రెడ్ డైరీలో నమోదయ్యాయని ఆరోపించడాన్ని మోడీ ప్రస్తావించారు. రైతులు, సైనికులను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని, వారికి కుర్చీ తప్ప మరేది కనిపించదని, ప్రజల ప్రయోజనాల కంటే కాంగ్రెస్ తన ఓటు బ్యాంకునను ఎక్కువగా ప్రేమిస్తోందని ఆయన ఆరోపించారు.
Also Read
- Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
- Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
Read Also: Putin: ప్రధాని మోడీ చాలా తెలివైన వ్యక్తి.. రష్యా అధ్యక్షుడి ప్రశంసలు..
జోధ్‌పూర్ లో రూ. 5000 కోట్ల ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం అశోక్ గెహ్లాట్ గైర్హాజరయ్యారు. దీనిపై మోడీ విమర్శలు ఎక్కుపెట్టారు. మోడీ వస్తే అంతా బాగానే ఉంటుందని కాంగ్రెస్ లీడర్లు అనుకుంటారని ఎద్దేవా చేశారు. అంతా మేం చూసుకుంటాం, మీరు రెస్ట్ తీసుకోండని గెహ్లాట్ కి చురకలు అంటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి మాట్లాడుతూ.. మహిళలు, దళితులపై అత్యాచారాలను ప్రస్తావించారు.
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్ తో పాటు తెలంగాణ, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రాల ఎన్నికలు ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారాయి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది.
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!