Luna-25: చంద్రయాన్‌ని ఓడించాలనుకుంది.. జాబిల్లిపై క్రాష్ అయింది.. ఇదే కారణమన్న రష్యా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Luna-25: చంద్రయాన్-3, అంతరిక్ష రంగంలో భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడించింది. ఎవరికి సాధ్యం కాని చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్‌ని విజయవంతంగా దించింది. చంద్రుడిపై ఇలా ల్యాండర్, రోవర్లని దించిన నాలుగో దేశంగా, దక్షిణ ధృవంపై దిగిన మొదటి దేశంగా కీర్తిగడించింది. అంతకుముందు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడిపై ల్యాండర్లను దించాయి. అయితే చంద్రయాన్-3 సమయంలో రష్యా తన లూనా-25 స్పెస్‌క్రాఫ్టుని, చంద్రయాన్ కన్నా ముందు దక్షిణ ధృవంపై దించాలని విఫలమైంది. దీని తర్వాత నాలుగు రోజులకు చంద్రయాన్-3 జాబిల్లిని చేరింది.
లూనా-25 చంద్రుడిపై కుప్పకూలింది. అన్ని అనుకున్నట్లు జరిగితే చంద్రయాన్ కన్నా ముందే లూనా-25 జాబిల్లిని చేరేది. అయితే ఇలా కుప్పకూలడానికి కారణాలను రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ వెల్లడించింది. ఆగస్టు 19న లూనా-25 అదుపుతప్పి చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలింది. అంతరిక్ష నౌకలో ఏర్పడిన సాంకేతిక లోపమే ఇందుకు కారణమని వెల్లడించింది.
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
Read Also: Haryana: అమ్మాయిల వేధింపులు.. 9వ తరగతి బాలుడు ఆత్మహత్య..
ఆన్-బోర్డ్ కంట్రోల్ యూనిట్‌లో లోపం ఏర్పడిందని, కంట్రోల్ యూనిట్ ప్రొపల్షన్ యూనిట్‌ను సరైన సమయంలో నిలిపేయలేదని, దీని వల్ల లూనా-25 చంద్రుడి వైపు వేగంగా దూసుకెళ్తున్న సమయంలో అనుకున్న దాని కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ సేపు ఇంజన్లు మండాయని తెలిపింది.
చంద్రుడిపై స్పేస్ క్రాఫ్ట్ దిగేందుకు వృత్తాకార కక్ష్యను, దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి బదిలీ చేసేసమయంలో లూనా-25లోని ప్రొపెల్షన్ సిస్టమ్ 84 సెకన్లకు బదులుగా 125 సెకన్ల పాటు పనిచేసిందని రోస్ కాస్మోస్ వెల్లడించింది. తప్పుడు డేటా కమాండ్ కారణంగా ఆన్ బోర్డు కంట్రోల్ సిస్టమ్ కోణీయ వేగాన్ని కొలిచే యూనిట్ పనిచేయకపోవడంతో క్రాష్ జరిగిందని గుర్తించింది. దీంతో అవసరమై నమయంలో ఇంజన్లు ఆఫ్ కాలేదని, ఈ కారణంగా లూనా-25 కుప్పకూలిందని తెలిపింది.
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!