Mukkoti Ekadashi: ముల్లోకాలను నడిపించే ఆ శ్రీ విష్ణువుని ముక్కోటి ఏకాదశి (Vaikuntha Ekadashi) రోజున ప్రార్థించే వారికి మోక్షం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి నాడు విష్ణువు ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి పెడతారు. క్షీరసాగర మథనం జరిగి హాలాహలం, అమృతం ఆవిర్భవించింది ఈ రోజునే. అందుకే ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు రేపు (డిసెంబరు 30న ) ఉపవాసం ఉండి లక్ష్మీ సమేతుడైన ఆ మహావిష్ణువుని భక్తితో పూజించి, నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేస్తే పుణ్యం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి, ద్వాదశి రోజున అతిథి లేకుండా భుజించరాదని పేర్కొంటున్నారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవాళ్లు పాప విముక్తుల అవుతారని పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసంతో జీర్ణాశయానికి రెస్ట్ దొరకడం ఆరోగ్యప్రదమే గాక ఏకాదశి రోజు చేసే ఆధ్యాత్మిక సాధనకు శరీరం పూర్తిగా సహకరిస్తుంది.
Read Also: VanaVeera : ఆ చిన్న సినిమా ఇన్ సైడ్ టాక్ బాగుందట.. కానీ సెన్సార్ పెండింగ్?
అయితే, ఏకాదశి నాటి వ్రతంలో 7 నియమాలు..
* దశమి నాడు రాత్రి ఉపవాసం ప్రారంభించాలి..
* ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి.
* వైకుంఠ ఏకాదశి నాడు అబద్ధం ఆడొద్దు..
* చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
* స్త్రీ సాంగత్యం పనికి రాదు.
* ముక్కోటి ఏకాదశి రోజు రాత్రంతా జాగరణ చేయడం మంచిది.
* ఏకాదశి రోజున అన్నదానం చేయాలి.
ఇక, ద్వాదశి రోజున మళ్లీ భగవంతుడిని ఆరాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సత్కరించడం మంచింది. ఉపవాసం చేయలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు లాంటి పదార్థాలు తినవచ్చు. ముక్కోటి ఏకాదశి రోజున చేసే విష్ణు పూజ, భగవత్ గీత పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం, గో సేవ, మీకు శక్తిని అనుసరించి చేసే దానధర్మాలు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఇవన్నీ చేసే ఛాన్స్ లేకపోతే.. ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడంతో అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
అయితే, శ్రీమహావిష్ణువు కొలువై ఉండే దేవాలయమే మన దేహమని శాస్త్రం చెప్తుంది. ఉపనిషత్తులు చెప్పినట్లుగా ప్రతి మానవ హృదయంలోనూ జీవుడనే దేవుడిగా పరమాత్మ ప్రకాశిస్తుంది. పరమాత్మను దగ్గరగా సేవించేందుకు ఏకాదశి వ్రతాన్ని నియమంగా పాటించాల్సిందే. ఉపవాసం చేయడం ద్వారా పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనసు.. మొత్తం పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకోని, పూజ-జపం-ధ్యానం చేయాడం వల్ల ఆ గోవిందుడి ఆశీస్సులు లభిస్తాయని భక్తుల నమ్మకం.