GHMC Meeting: కాసేపట్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరగనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ అధికారులు సిద్ధం చేసిన బడ్జెట్ ముసాయిదాను స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రవేశ పెట్టనున్నారు. స్టాండింగ్ కమిటీలో బడ్జెట్ ముసాయిదాపై చర్చించిన తర్వాత సభ్యులు ఆమోదం తెలపనున్నారు. ఇక, జనవరిలో స్పెషల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించి బడ్జెట్ కు ఆమోదం తెలిపి ప్రభుత్వానికి అధికారులు పంపనున్నారు. గతేడాది కంటే రూ. 450 కోట్లు పెంచి రూ. 11,460 కోట్లతో బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
అయితే, స్టడీ టూర్ కోసం జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు అంతా అహ్మదాబాద్ లేదా చండీఘర్ వెళ్లేందుకు ప్రతిపాదనలు చేశారు. ప్రతిపాదనలపై చర్చించిన అనంతరం స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. అలాగే, నగరంలో పలు అభివృద్ధి పనులతో పాటు రోడ్డు విస్తరణ పనులపై స్టాండింగ్ కమిటీలో చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ విస్తరించిన తర్వాత మొదటి స్టాండింగ్ కమిటీ సమావేశం కావడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.